Analyst Damu Balaji : పవన్ కళ్యాణ్ కి ఎన్పిడి రోగం ఉంది… డాక్టర్ రాజు రవితేజ సంచలన కామెంట్స్… ఆ రోగం లక్షణాలు ఏంటంటే…: అనలిస్ట్ దాముబాలాజీ

Analyst Damu Balaji : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఆయనతో కలిసి దాదాపు 12 ఏళ్ళు ట్రావెల్ చేసిన డాక్టర్ రాజురవితేజ అనే వ్యక్తి ఇటీవల స్వప్న కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తీవ్ర ఆరోపణలను చేసారు. ఆయనకు ఎన్పిడి రోగం ఉందంటూ చెప్పారు. ఆయన నుండి ఎవరూ సంతోషంగా బయటికి రారని బాధతోనే ఇబ్బందితోనే బయటికి వస్తారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. అసలు ఏంటి ఎన్పిడి అంటే ఆ వ్యాధి లక్షణాలు ఏమిటి వంటి విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.

సెల్ఫ్ లవ్ ఎక్కువైతే వచ్చేదే…

దాము బాలాజీ ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ ఎన్పిడి అంటే నేరసిషస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ అంటూ తెలిపారు. నేరసిషస్టిక్ అంటే తమని తాము ఇతరుల కన్నా గొప్ప వారిగా భావించడం ఇతరులను తక్కువగా చూడటం అంటూ వివరించారు. నార్సిసస్ అనే రాజు తనని తాను ఎక్కువ ఇష్టపడటం వల్ల చివరికి నీటిలో తన బింబాన్ని ప్రేమిస్తాడు. చనిపోయేవరకు అలాగే ఉన్న అతని పేరు మీదుగా ఈ వ్యాధి పేరు వచ్చింది అంటూ దాము బాలాజీ వివరించారు. ఫ్రెస్కో థియరీ ప్రకారం ఈ వ్యాధిలో రెండు స్టేజ్లు ఉంటాయి. మొదట తమని తాము ఇష్టపడటం ఇది చిన్నతనంలో పిల్లల్లో కలుగుతుంది. అద్దంలో వారిని వారే చూసి వింతగా ఫీల్ అవుతుంటారు. అయితే అది పెద్దయ్యాక పోతుంది. కానీ కొంతమందిలో నేనే గొప్ప ఇతరులు నా ముందు చిన్నవారు అనే భావన ఎక్కువగా కలుగుతుంది అది తీవ్రమైతే ఎన్పిడి వస్తుంది. దాము బాలాజీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ను నేను బాలు సినిమా షూటింగ్ సమయంలో కలిసినపుడు ఆయన కోసం షూటింగ్ లో అందరూ మూడు రోజులుగా ఎదురు చూస్తున్నట్లు తెలిసింది.

ఆయనను షూటింగ్ కి రండి అని చెప్పే ధైర్యం అక్కడ ఎవరికీ లేదు. ఇక ఆయన నటించేటపుడు సైలెంట్ గా ఉండాలి, ఆయన కంటికి ఎదురుగా మనుషులు గుంపులుగా కనిపించరాదు. డైరెక్టర్ కానీ, కెమెరా మెన్ కానీ యాక్షన్ అంటూ సౌండ్ చేయరాదు కేవలం చేతులను ఊపుతూ చేయాలి. ఇప్పుడు ఆ విధానం మారిందో లేదో తెలియదు కానీ అప్పట్లో అలా ఉండేది అంటూ చెప్పారు. ఇక రాజు రవితేజ చెప్పిన విషయాలను ఉదాహరిస్తూ ఆ వ్యాధి ప్రధాన లక్షణం సెల్ఫ్ లవ్ ఆలాగే ఇతరులను తన కంట్రోల్ లో పెట్టుకోవడం, అందుకే బహుశా పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.