Analyst Damu Balaji : వైజాగ్ శ్వేతది హత్య, లేక ఆత్మహత్య… అక్కడి జాలర్లు ఏం చెబుతున్నారు…: ఎనాలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : తండ్రి లేడు, తల్లే అల్లారుముద్దుగా పెంచింది. బాగా కష్టపడి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని అనుకున్న శ్వేత కలలు పెళ్లితోనే ఆగిపోయాయి. పెళ్లయ్యాక చదువుకోడానికి ఒప్పుకుంటామని చెప్పి పెళ్లి చేసుకున్న భర్త పెళ్ళయ్యాక ఆ ఊసే ఎత్తలేదు. వావి వరసలు లేకుండా చెల్లి వరస అయ్యే శ్వేతతో ఆడపడుచు భర్త అసభ్యంగా ప్రవర్తించినా అత్తింటి వారు పట్టించుకోకపోగా తప్పు నీదేనని క్షమాపణ చెప్పించడంతో భరించలేక గర్భంతో ఉన్న తాను వైజాగ్ సముద్ర తీరాన శవమై కనిపించింది. అయితే ఆమె మరణం అనుమానస్పద మరణంగా కేసు నమోదు చేసారు పోలీసులు. శ్వేతది ఆత్మహత్య కాదని హత్య అని ఆమె తల్లి ఆరోపిస్తోంది. శ్వేత తల్లి ఆమె కూతురు మరణంతో అత్తింటి వారి మీద కేసు పెట్టింది. ఇంత వరకు శ్వేత మరణం హత్యనా లేక ఆత్మహత్యనా అన్నది తెలియరాలేదు. పోలీసుల కథనం ఒకలాగా ఉంటే సముద్రంలో ఉండే జాలర్ల కథనం మరోలా ఉందంటూ అనలిస్ట్ దాము బాలాజీ తెలుపుతున్నారు.

ఆమెది ఆత్మహత్య.. లేక హత్య…

బాలాజీ గారు శ్వేత మరణం గురించి మాట్లాడుతూ పోలీసులు ఆమెది ఆత్మహత్య అయ్యుండొచ్చని చెబుతున్నారు. సముద్రంలో పడి బయటికి రావడం వల్ల బట్టలు లేవని అలలు ఎక్కువ లేకపోవడం వల్ల ఆమె పడిన చోటే బయటికి శవం బయటపడిందని ఇసుకలో పుడకుపోయే అవకాశాలు ఉన్నాయంటూ వివరించారు. అయితే దీనికి విరుద్ధంగా సముద్రంలో చేపలు పట్టే జాలర్ల కథనం ఉందంటూ తెలిపారు బాలాజీ.

జాలర్లు నిరంతరం సముద్రంలోకి వెళ్తుంటారు, వాళ్ళు చెబుతున్న ప్రకారం వెళ్లిన చోటే శవం వచ్చి చేరదని ఎక్కడి నుండో ఎక్కడికో వెళ్లి పడుతుందని తెలిపారు. ఇక బట్టలు శరీరం నుండి వేరవడం జరగదని ఒకవేళ అలా దాటికి బట్టలు పోతే శరీరం మీద గాయాలు కూడా బలంగానే ఉండాలి అంటూ చెబుతున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటికీ హత్య ఆత్మహత్య రెండింటిలో ఏదన్నదీ తేలలేదని బాలాజీ తెలిపారు. మరింత మంది జాలార్లను విచారించి వివరాలను పోలీసులు సేకరిస్తునట్లు తెలిపారు.