Shriya: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన అలనాటి అందాల ముద్దుగుమ్మ శ్రియ శరన్ గురించి తెలియని వారంటూ ఉండరు. తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన శ్రియ సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఇక ఇప్పటికీ సినిమాలలో కీలకపాత్రలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.
ఇదిలా ఉండగా 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న శ్రియ గ్లామర్ విషయంలో కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా మెయింటైన్ చేస్తోంది. పెళ్లై ఒక కూతురు పుట్టిన తర్వాత కూడా శ్రియ అందం తగ్గలేదు. ఇదిలా ఉండగా గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రియ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది.
ఈ ఇంటర్వ్యూలో ” పెళ్లయి కూతురు పుట్టిన తర్వాత కూడా మీరు ఇంత అందంగా ఉండటానికి కారణం ఏమిటి అని శ్రియ ని జర్నలిస్ట్ ప్రశ్నించగా.. ‘ పెళ్లి తర్వాత కూడా నేను అలాగే అందంగా ఉన్నానని నా స్నేహితులు మెచ్చుకున్నారు. కానీ ఇక్కడ అందం మాత్రమే కాదు ..నా వయసు ఎంత ? నేను ఇండస్ట్రీలో ఎంత కాలం నుండి ఉన్నాను? అనేది కూడా ముఖ్యమే. ఇదే ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం మీకుందా ?
ఇండస్ట్రీలో హీరోలను మీరు ఈ ప్రశ్న అడిగిన రోజున నేను దీనికి సమాధానం చెబుతాను ” అంటూ శ్రియ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ వీడియోని తాజాగా ఒక నెటిజన్ ట్విట్టర్లో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో హీరోల గ్లామర్ గురించి శ్రియ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం శ్రియ భోలా శంకర్ సినిమాలో చిరంజీవితో కలిసి స్పెషల్ సాంగ్ లో చేయబోతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…