Analyst Damu Balaji : వైసీపీ కి 175 సీట్లు..25 పార్లమెంటు స్థానాలు…టైమ్స్ నౌ సర్వే సంచలనం…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : ఎన్నికలకు ఏడాది సమయం ఉండగానే అపుడే ఏ పార్టీ కి బలం పెరుగుతోంది, ఏ పార్టీ పైన వ్యతిరేకత మొదలైంది వంటి అంశాల మీద అపుడే అంచనాలు మొదలయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్నికలతో పాటు దేశ వ్యాప్త నగారా మోగే సమయంలో ఏపీ రాజకీయాల్లో టైమ్స్ నౌ పత్రిక సర్వే సంచలనం రేపుతోంది ఎక్కువగా జగన్ 175 కి 175 సీట్లు తెచ్చుకుంటాడంటాడని చెప్పేస్తుంది. అయితే ఇందులో నిజమేంత సర్వేలంటూ వచ్చే వాటి మీద ఉన్న నిబద్ధత ఏమిటి వంటి విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.

వై నాట్ 175 నిజమవుతుందా….

జగన్ పదే పదే చెప్పే ఒక స్లోగన్ వై నాట్ 175. గత ఎన్నికల్లో 151 సీట్లు తెచ్చుకున్న జగన్ ఈసారి 175 కి 175 వస్తాయని ఆ దిశగా పనిచేయాలని తన పార్టీని సిద్ధం చేస్తూ ప్రత్యర్థులతో మైండ్ గేమ్ ఆడిస్తున్నారు అంటూ బాలాజీ తెలిపారు. తాజాగా సర్వే విడుదల చేసిన జాతీయ సంస్థ టైంస్ నౌ లో జగన్ కు ఏకంగా 175 స్థానాలు వస్తాయని చెప్పడం కొంచం ఆశ్చర్యన్ని కలిగించిందని చెప్పారు. వోటింగ్ పెర్సెంటేజ్ చూస్తే 57% ఓట్లు జగన్ కివస్తాయని చెప్పారు. దీన్ని బట్టి జగన్ పరిపాలన మీద ఎక్కడ వ్యతిరేకత ఏర్పడలేదు అన్నది అర్థం అవుతోంది.

ఎంపీ సీట్స్ కూడా దాదాపు అన్ని లేకపోతే 24 జగన్ సొంతం కాబోతున్నాయని టైం నౌ తెలిపింది ఈ సర్వే లో మిగిలిన ప్రతిపక్షాలు ఒంటరిగా పోటీ చేస్తేనే ఇన్ని సీట్స్ వస్తాయని ప్రతిపక్షాలు కలిసి పోటీచేస్తే ఫలితం మారుతుందని చెప్పిందని బాలాజీ తెలిపారు. ఇప్పటికే టీడీపీ ,జనసేన పొత్తు దిశగా అడుగులేస్తుండగా వీటి జతకు బీజేపీ వస్తుందేమో చూడాలని బాలాజీ తెలిపారు. ఒకవేళ ప్రతిపక్షాలు ఏకమైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదు అంటూ అపుడు నష్టం జగన్ కే అంటూ చెప్పారు .