Analyst Damu Balaji : సాఫ్ట్ వేర్ రాధ మర్డర్ కేసులో ట్విస్టు…. అసలు హంతకుడు అతనే….: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : భార్యభర్తల మధ్య వచ్చే చిన్న అనుమానాలే పెను భూతలై చివరకు క్రైమ్స్ కి దారితీస్తున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన రాధ అనే మహిళకు మోహన్ రెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగితో పెళ్లి జరిగింది. వారికి ఒక ఐదేళ్ళ బాబు కూడా ఉండగా ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కాగా రాధాకి చిన్న తనం నుండి కాశీ రెడ్డి అనే వ్యక్తి మంచి స్నేహితుడు. అతని ఉద్యోగం పోవడం సొంతంగా సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టుకోవడంతో అతను అప్పుగా డబ్బు అడగడంతో రాధ అతని భర్త ద్వారా 80 లక్షలు అప్పు ఇప్పించింది. అయితే డబ్బు ఇప్పటికీ తిరిగి ఇవ్వకపోవడంతో ఇప్పటికే పంచాయితీ జరుగగా తాజాగా రాధ హత్య జరగడంతో కాశి రెడ్డి మీద అనుమానం వచ్చి అతని కోసం గాలింపు జరుగగా అతను పరారిలో ఉన్నాడు. ఇక ఈ కేసు గురించి ఆసక్తికర విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ విశ్లేషించారు.

మోహన్ రెడ్డి అసలు హంతకుడు…..

అనలిస్ట్ దాము బాలాజీ ఈ కేసు గురించి మాట్లాడుతూ ఈ కేసును పోలీసులు ఒక రోజులోనే పురోగతి సాధించారు అంటూ తెలిపారు. ఈ కేసులో కోదాడకు చెందిన రాధ భర్త మోహనరెడ్డి అసలు నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు అంటూ దాము బాలాజీ తెలిపారు. మొదట కేసు కాశిరెడ్డి చుట్టూ తిరిగినా రాధా ఫోన్ కి కాశిరెడ్డి పేరుతో మెసేజెస్ పెట్టిన ఫోన్ నెంబర్ ఎక్కడి నుండి మెసేజెస్ పంపారో పోలీసులు ఆరా తీయగా హైదరాబాద్ లోని కొబ్బరి బొండాలు అమ్మే ఒక మహిళ ఫోన్ నుండి అని తెలిసింది. ఆమె దగ్గర కాశీ రెడ్డి అలాగే మోహన్ రెడ్డి ఫోటోలను చూపించి అడుగ్గా మోహన్ రెడ్డి తన వద్ద ఫోన్ తీసుకుని తిరిగి ఇచ్చేటపుడు సిమ్ తీసుకుని ఫోన్ ఇచ్చినట్లు చెప్పడంతో హత్య చేసింది మోహన్ రెడ్డి అని పోలీసులకు క్లారిటీ వచ్చిందంటూ చెప్పారు బాలాజీ.

ఇక రాధ ను మోహన్ రెడ్డి కాశిరెడ్డి పిలిచినట్లుగా ఒక ప్రదేశానికి పిలిపించి అక్కడే ఆమెను కొట్టి స్పృహ కోల్పోయాక కాళ్ళ మీద కారు ఎక్కించి ఆమెను సిగరెట్లతో కాల్చి ఆమె గుండె మీద కారు ఎక్కించి చివరగా బండ రాయితో ఆమె తల నుజ్జు చేసి చంపేశాడు. ఆమె మరణించాక కారును తోసేసి అక్కడి నుండి వచ్చేసాడు. కాశీ రెడ్డి ని డబ్బులదిగే విషయంలో కాశీ రెడ్డిని, రాధని ,మోహన్ రెడ్డి అనుమానించాడు. ఆ అనుమానం బలపడటంతో ఆమెను హత్య చేసి ఆ నేరం కాశీ రెడ్డి మీద వేసి ఉండవచ్చు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.