Brahmanandam: హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గురించి తెలియని వారంటూ ఉండరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్. గా గుర్తింపు పొందిన బ్రహ్మానందం కొన్ని వందలకు పైగా సినిమాలలో నటించి తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఇక ప్రస్తుతం వయసు పెరగటంతో అడపా దడపా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా బ్రహ్మానందం ఇంట్లో పెళ్లి సందడి మొదలైనట్లు తెలుస్తోంది.
తాజాగా బ్రహ్మానందం చిన్న కుమారుడి నిశ్చితార్థ వేడుక హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు. ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్రహ్మానందంకి ఇద్దరూ కుమారులు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. పెద్ద కుమారుడు గౌతమ్ హీరోగా కొన్ని సినిమాలు నటించాడు. అయితే సరైన విజయాలు అందుకోకపోవడంతో సినిమాలకు దూరం అయ్యాడు. ఇక చిన్న కొడుకు సిద్దార్థ్ విదేశాలలో సెటిల్ అయ్యాడు.
తాజాగా ఆదివారం రోజున సిద్దార్థ్ నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది. డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె ఐశ్వర్యతో సిద్దార్థ్ నిశ్చితార్ధం జరిగింది. సిద్దార్ధ్‌కు కాబోయే భార్య ఐశ్వర్య కూడా డాక్టరే కావడం విశేషం. ఈ నిశ్చితార్థ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.
ఇక ఈ పెళ్లి పెద్దలు కుదిర్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి నిశ్చితార్ధ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక వీరి పెళ్లి కూడా తొందర్లోనే జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇక చిన్న కుమారుడి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిపించాలని బ్రహ్మానందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం సిద్ధార్థ, ఐశ్వర్య నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో బ్రహ్మానందం దంపతులతో పాటు అతని పెద్ద కుమారుడు గౌతమ్ కోడలు పిల్లలు కూడా ఉన్నారు. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు సిద్ధార్త్, ఐశ్వర్య దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…