Pooja Hedge: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న వారిని పూజా హెగ్డే కూడా ఒకరు. ముకుంద సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్ అడుగుపెట్టిన ఈ అమ్మడు తన అందం ,అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఈ క్రమంలో తెలుగు, తమిళ్, హిందీ భాషలలో స్టార్ హీరోలు సరసన నటించే అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజ హెగ్డే అందం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సాధారణంగా హీరోయిన్లు అందరి దృష్టిని ఆకర్షించడానికి ఇష్టపడతారు. ఈ క్రమంలో ఫ్యాషన్ మీద ఎక్కువ దృష్టి పెడతారు. ఎప్పటికప్పుడు సరికొత్త ఫ్యాషన్ తో మరింత స్టైలిష్ గా కనిపిస్తుంటారు. ఇక పూజ హెగ్డే కూడా ఈ కోవకు చెందినదే.
ఒకవైపు సినీ ప్రయాణాన్ని, మరొకవైపు ఫ్యాషన్ ప్రయాణాన్ని సమానంగా కొనసాగిస్తూ అందరూ దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే ఫ్యాషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఇక ఈ ఇంటర్వ్యు లో మీ దృష్టిలో ఫ్యాషన్ అంటే ఏమిటి అని ప్రశ్నించగా..” సౌకర్యం అంటూ సమాధానం ఇచ్చింది. మన శరీరానికి,మన ఆలోచనలకు తగ్గట్టు ఉండే దుస్తులు ధరించినప్పుడు సౌకర్యంగా ఉంటుంది. అలా సౌకర్యంగా భావించినప్పుడు మనకు ఎప్పటికీ కొత్తగానే కనిపిస్తాయి.
మనలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతాయి అంటూ చెప్పుకొచ్చింది. నేనెప్పుడూ కొత్తగా కనిపించటానికి ఇష్టపడతా. అందువల్ల బ్రాండ్స్ కి , డిజైన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అంటూ పూజా తెలిపింది. ఫ్యాషన్ గురించి పూజ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇక పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే…ఇటీవల ” కిసీ కా భాయ్ కిసీ కి జాన్ ” అనే సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన నటించింది. ఇక ప్రస్తుతం ఒక హింది సినిమాతో పాటు తెలుగులో మహేశ్ బాబు సరసన కూడా నటిస్తోంది.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…