Analyst Damu Balaji : సిబిఐ కొత్త బాస్ గా ప్రవీణ్ సూద్… వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏం జరగనుంది…: అనలిస్ట్ దాము బాలజీ

Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి మరణించి నాలుగేళ్లు కావొస్తున్నా ఎవరు చంపారనే విషయాలు స్పష్టంగా ఇప్పటికీ తెలియరాలేదు. ఏపీ సీఎంకి సొంత బాబాయ్ అయినా ఎవరు చంపారో ఇప్పటికీ తేలక పోవడం పట్ల అటు విపక్షాల నుండి గట్టి విమర్శిలే ఎదుర్కొంటున్న జగన్ ఇంట్లోనే హంతకులున్నారనే కథనాలు వండుతున్న విమర్శకు కౌంటర్లు వేస్తున్నారే కానీ కేసులో మాత్రం పురోగతి లేదు. రోజుకో పేరు బయటికి వస్తుంది, ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు అంటూ వార్తలు వినిపించినా అవేవి జరగలేదు. కాగా నేడు సిబిఐ కి కొత్త బాస్ అపాయింట్ అయ్యారు. దీంతో వివేకానంద మర్డర్ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే ఆసక్తి అందరిలోనూ మొదలయింది. ఇక ఈ విషయాల గురించి అనలిస్ట్ దాము బాలాజీ విశ్లేషించారు.

బీజేపీ డిజిపి ప్రవీణ్ సూద్…

కర్ణాటక రాష్ట్ర డిజిపి గా ఉన్న ప్రవీణ్ సూద్ ను కేంద్రం సిబిఐ చీఫ్ గా నియమిస్తునట్లు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కర్ణాటక లో డిజిపి గా పనిచేస్తున్న సమయంలో ప్రవీణ్ సూద్ మీద చాలా ఆరోపణలు వినిపించాయి. హిమాచల్ రాష్ట్రానికి చెందిన ప్రవీణ్ సూద్ కర్ణాటక క్యాడర్ ఐపీస్. ఉన్నత చదువులు చదివిన ఈయన మారిషస్ లో అక్కడి ప్రభుత్వానికి పోలీసు శాఖ సలహాదారుగా కూడా పనిచేసి వచ్చారు. అయితే కర్ణాటక డిజిపి గా ఉన్న సమయంలో బీజేపీ కి సపోర్ట్ గా ఉంటూ అక్కడి కాంగ్రెస్ నాయకుల మీద కేసులు వేశారనే ఆరోపణలు ఉన్నాయి.

కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన పలు ప్రచారాల సమయంలో కూడా కేసులు వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా కర్ణాటకలో తాజాగా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడంతో బీజేపీ ప్రవీణ్ సూద్ ను సిబిఐ చీఫ్ గా నియమించిందని వినిపిస్తుందంటూ బాలాజీ అభిప్రాయాపడ్డారు. అయితే వివేకానంద కేసులో ఎలాంటి మార్పు రాబోతోంది అన్న విషయం గురించి బాలాజీ మాట్లాడుతూ ఇప్పటి దాకా సిబిఐ ఆఫీసర్స్ వైసీపీ యాంటీ గా పనిచేసినవారే, ఇప్పుడు వచ్చిన సిబిఐ చీఫ్ బీజేపీ సపోర్టర్ కావడం వల్ల కేసు కొత్తమలుపు తిరుగుతుంది అంటూ చెప్పారు.