Analyst Damu Balaji : సుప్రీం కోర్ట్ లో సునీత కు షాక్… అవినాష్ రెడ్డికి ఊరట…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : వివేకానంద హత్య కేసు అనేక మలుపులు తిరిగి మళ్ళీ అవినాష్ రెడ్డి అరెస్టు దగ్గరే ఆగుతోంది. ఎంపీ అవినాష్ రెడ్డి వివేకానందను హత్య చేయించారని ఈ కేసులో మొదటి నుండి ఆయనను అరెస్టు చేయాలని వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి కోరుకుంటున్నారు. అయితే ఎప్పటికప్పుడు కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండగా తాజాగా సుప్రీం కోర్ట్ ను సునీత్ రెడ్డి ఆశ్రయించారు. సుప్రీం కోర్ట్ లో తాజగా ఎర్రగంగిరెడ్డి బెయిల్ పిటిషన్ మీద జరిగిన వాదనలో జరిగిన పరిణామాల గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

సునీతకి షాక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్…

వివేకానంద కేసు ఆ కోర్ట్ ఈ కోర్ట్ అనుకుంటూ చివరికి ఇపుడు సుప్రీం కోర్ట్ వద్దకు చేరగా సుప్రీం కోర్ట్ మొదటి నుండి అన్ని ఆధారాలను ఆలగే పోలీసుల ఛార్జ్ షీట్స్ ను సేకరించి విచారించాలని భావిస్తోంది. తాజాగా ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ మీద విచారణ జరిపి బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది కోర్ట్. ఏ1 గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి కి బెయిల్ ఇవ్వడానికి సుప్రీం నిరాకరించింది.

ఇది సునీతకు ఊరట కలిగించే అంశం అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. అప్రూవర్ గా మారమని ఎర్ర గంగిరెడ్డిని సునీత సిబిఐ ద్వారా ఒత్తిడి చేసినా అది కుదరలేదు అందుకే బెయిల్ మీద బయటికి రాకూడదని సునీత గట్టిగా ప్రయత్నించింది అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. ఇక అవినాష్ రెడ్డి కి సెప్టెంబర్ 11 వరకు ముందస్తు బెయిల్ ఉండటం వల్ల ఆయనకు ఊరట కలిగించే అంశమే ఆయన ముందస్తు బెయిల్ ను రద్దు చేసి రిమాండ్ కు తీసుకోవాలని సునీత పిటిషన్ వేసినా సుప్రీం ఒప్పుకోలేదు. అయితే సిబిఐ కోర్ట్ మాత్రం అవినాష్ రెడ్డి ని కోర్ట్ కి హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది అంటూ బాలాజీ తెలిపారు.