Analyst dheeraj Appaji : ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ రాకపోడానికి కారణం అదే….: అనలిస్ట్ ధీరజ్ అప్పాజీ

Analyst Dheeraj Appaji : సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను గత ఏడాది మే 28 న మొదలు పెట్టి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఏదో ఒక ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. అలా ఇటీవల విజయవాడ లో జరిగిన శత జయంతి వేడుకలకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చారు. తాజాగా హైదరాబాద్ లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరుగగా సినిమా పరిశ్రమ నుండి తారలు, అలాగే రాజకీయ ప్రముఖులు విచ్చేసారు. అయితే ఎన్టీఆర్ కుటుంబం నుండి కూడా చాలా మంది హాజరైన ఎన్టీఆర్ మనవడిగా సినిమాల్లో సత్తా చాటుతున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ వేడుకలలో కనిపించకపోవడం నందమూరి అభిమానులకు బాధ కలిగించింది. అసలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఈ వేడుకలకు రాకపోడానికి గల కారణాలను అనలిస్ట్ ధీరజ్ అప్పాజీ వివరించారు.

ఎన్టీఆర్ రాకపోడానికి కారణాలు అవే….

ఎన్టీఆర్ ను మొదటి నుండి నందమూరి కుటుంబం కలుపుకోలేదు, ఇది అందరికి తెలిసిన బహిరంగ సత్యం అయితే అప్పడప్పుడు బాబాయి అబ్బాయి ఏదైనా ఫంక్షన్స్ లో కలవడం వంటివి చేస్తే అదే నందమూరి అభిమానులకు పండగ. అయితే తాజాగా బాలకృష్ణ గారు ప్రత్యేక చొరవ చూపి మరీ చేసిన సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు ఇండస్ట్రీ లోని చిన్న పెద్ధ అందరు హీరోలు రాగా ఎన్టీఆర్ కనిపించకపోవడం, అలానే ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ కూడా రాకపోవడం హాట్ టాపిక్ అయింది. ఇక దీని గురించి అనలిస్ట్ అప్పాజీ మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ఈ వేడుకలకు రాకపోడానికి రెండు కారణాలలు ఉన్నాయి. మొదటిది అదే రోజు ఆయన పుట్టినరోజు కావడం ఆయన కుటుంబంతో కలిసి అత్యంత సన్నిహితులతో కలిసి మాల్దీవులకు ట్రిపు వెళ్లారు.

ఈ ప్రోగ్రామ్ ఎపుడో ఫిక్స్ చేసుకున్నది అందుకే వెళ్లారు. ఇక మరో కారణం చాలా కాలంగా టీడీపీ పార్టీ కి దూరంగా ఎన్టీఆర్ ఉంటున్నారు. ఈ శత జయంతి ఉత్సవాలలో కూడా రాజకీయా ప్రస్తవన ఉంది కనుక దూరంగా ఉన్నారు అంటూ చెప్పారు. ఇక చాలా కాలంగా కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇద్దరు ఒకే మాట అన్నట్లుగా మెలుగుతున్నారు. అలా ఎన్టీఆర్ రాకపోవడం వల్ల కళ్యాణ్ రామ్ కూడా రాలేదు. పైగా ఎన్టీఆర్ 30 వ సినిమా కొరటాల డైరెక్షన్ సినిమాకు ఒక నిర్మాతగా కళ్యాణ్ రామ్ వ్యవహారిస్తున్నారు అందువల్ల ఆ పనుల్లో బిజీగా ఉండి ఉండవచ్చు అంటూ అప్పాజీ చెప్పారు.