NTR Fans: తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన RRR సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందారు. ఈ సినిమా తరువాత ఈయన చేసే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఇక ఎన్టీఆర్ కు ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో కూడా అభిమానులు పెరిగిపోయారు. ఎన్టీఆర్ సినిమాలు వస్తున్నాయి అంటే అభిమానులు చేసే రచ్చ మామూలుగా ఉండదు. తాజాగా ఈయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సింహాద్రి సినిమాని విడుదల చేశారు.
ఈ సినిమా విడుదల సందర్భంగా అభిమానులు కాస్త అత్యుత్సాహం కనబరిచారు. లండన్ లోని ఓ థియేటర్లో ఏకంగా క్రాకర్స్ కాల్చడంతో థియేటర్లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించిన విషయం మనకు తెలిసిందే.అదే విధంగా కృష్ణా జిల్లా మచిలీ పట్నంలోని సిరివెంకట్, సిరికృష్ణ అనే 2 థియేటర్ వద్ద అభిమానులు రెండు మేకలను వేట కొడవళ్లతో నరికి వాటి రక్తాన్ని తారక్ ఫ్లెక్సీపై చిందించారు.
ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పోలీసుల కంట పడటంతో ఏకంగా తొమ్మిది మంది ఎన్టీఆర్ అభిమానులను అరెస్టు చేశారు. మారణాయుధాలు వినియోగించి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారంటూ అభిమానులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై స్పందించిన పలువురు హీరోలు అంటే అభిమానం ఉండాలి కానీ మరి ఇంత అత్యుత్సాహం చూపించకూడదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…