Anchor Anasuya: నెగెటివ్ ట్రోల్స్ పై యాంకర్ అనసూయ సంచలన వ్యాఖ్యలు..! దానిని నమ్ముతా అంటున్న అనసూయ..!

Anchor Anasuya: నెగెటివ్ ట్రోల్స్ పై యాంకర్ అనసూయ సంచలన వ్యాఖ్యలు..! దానిని నమ్ముతా అంటున్న అనసూయ..!

Anchor Anasuya: అనసూయ స్టార్ యాంకర్ గానే కాకుండా.. సినిమాల్లో కూడా పాపులర్ అవుతోంది. వరసగా సినిమా అవకాశాలు దక్కించుకుంటోంది. రంగస్థలం, పుష్ప వంటి సినిమాలతో తన కెరీర్ ను సుస్థిరం చేసుకుంటుంది. రంగస్థలంలో చేసిన రంగమ్మత్త క్యారెక్టర్ అనసూయకు ఎంత గుర్తింపు తెచ్చిందో మనందరకి తెలసిందే.

Anchor Anasuya: నెగెటివ్ ట్రోల్స్ పై యాంకర్ అనసూయ సంచలన వ్యాఖ్యలు..! దానిని నమ్ముతా అంటున్న అనసూయ..!
Anchor Anasuya: నెగెటివ్ ట్రోల్స్ పై యాంకర్ అనసూయ సంచలన వ్యాఖ్యలు..! దానిని నమ్ముతా అంటున్న అనసూయ..!

తాజాగా పుష్ప సినిమాలో నెగిటివ్ రోల్ ద్రాక్షాయణి క్యారెక్టర్ లో తన నటనతో ప్రశంసలు దక్కించుకుంటోంది. ఓ వైపు టీవీ షోలతో మరో వైపు సినిమాలో బిజీ అవుతోంది అనసూయ. ఇక పుష్ప సినిమా 2 పార్ట్ లో ద్రాక్షాయణి క్యారెక్టర్ కీలకం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఎప్పుడూ ఏదో వివాదంతో సోషల్ మీడియాలో ఉంటారు అనసూయ.

Anchor Anasuya: నెగెటివ్ ట్రోల్స్ పై యాంకర్ అనసూయ సంచలన వ్యాఖ్యలు..! దానిని నమ్ముతా అంటున్న అనసూయ..!

గతంలో తన డ్రెస్సింగ్ పై, బాడీ షేమింగ్ చేస్తూ.. ట్రోలింగ్ కామెంట్లు చేసిన వారికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది అనసూయ. కొంతమంది పని కట్టుకుని నాపై నెగిటివ్ ట్రోలింగ్ చేస్తున్నారని మండిపడింది. ఇటీవల కోట శ్రీనివాస్ రావు చేసిన వ్యాఖ్యలపై కూడా మండిపడింది అనసూయ.

ప్రతి ఒక్కరి సంగతి చూస్తానంటూ వార్నింగ్..

కోటా వంటి సీనియర్ నటుడినినే వదిలిపెట్టని అనసూయ.. సాధారణ నెటిజెన్లు ట్రోలింగ్ చేస్తే ఊరుకుంటుందా మరి. అందుకే నెటిజెన్లకు ఘాటు రిప్లైలు కూడా ఇస్తోంది. అయితే ఇటీవల అలీతో సరదాగా షోకు హాజరైంది. నెగిటివ్ ట్రోలింగ్ పై స్పందించింది. తనపై ట్రోలింగ్ చేస్తున్నవారి చిట్టా తన దగ్గర ఉందని.. ప్రతి ఒక్కరి సంగతి చూస్తానంటూ స్ట్రాంగ్ గానే వార్నింగ్ ఇచ్చింది. కెరీర్ ఆరంభంలో ఈ ట్రోలింగ్ వలన తాను.. తన కుటుంబం ఎన్ని కష్టాలని చవి చూసిందో.. ఎంతగా డిప్రెషన్ లోకి వెళ్లిందో చెప్పుకొచ్చింది అనసూయ. నెగిటివ్ ట్రోలింగ్ ను ఎలా ఎదుర్కొంటున్నారని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు తన దైన శైలిలో సమాధానం ఇచ్చింది అనసూయ. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని.. అది కచ్చితంగా అందరికీ న్యాయం చేస్తుందని తెలిపింది. ఒకరిని నువ్వు తిడితే.. ఇంకొకరు నిన్ను తిడతారు.. నువ్వు ఒకడిని బాధ పెడితే.. నిన్ను ఒకరు బాధపెడతారు అంటూ ఫిలాసఫీ చెప్పింది.