Dhanush - Aishwarya Divorce: ధనుష్, ఐశ్వర్య.. విడాకులు ప్రకటించిన స్టార్ కపుల్?
Dhanush – Aishwarya Divorce: కోలీవుడ్ హీరో ధనుష్- ఐశ్వర్య దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించారు. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోతుండటం.. చాలా మంది ఫ్యాన్స్ ను షాక్ గురిచేసింది. 18 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. తాము ఇద్దరం విడిపోతున్నట్లు ట్విట్టర్ వేదికగా లేఖను విడుదల చేశారు. 18 ఏళ్లుగా స్నేహితులుగా, భార్యభర్తలుగా కలిసి ఉన్నామని.. ప్రస్తుతం విడిపోతున్నట్లు ఐశ్వర్య తెలిపారు.
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా.. ఇలా ఇద్దరు విడిపోవడం సినీ లవర్స్ తో పాటు, వారి ఫ్యాన్స్ ను షాక్ గురి చేస్తోంది.
సెలబ్రెటీ జీవితాల్లో ఏ చిన్న విషయం ఉన్నా.. వెంటనే లీకులు, పుకార్లు వస్తుంటాయి. అలాంటిది సూపర్ స్టార్ రజినీ కాంత్ కూతురు ఐశ్వర్య, టాలెంటెడ్ యాక్టర్ ధనుష్ దంపతులు విడిపోతున్నారంటే.. ఎంతో కొంత సమాచారం బయటకు వస్తుంటుంది. కానీ ఇక్కడ ఇదేమి జరగలేదు. కనీసం ఒక చిన్న రూమర్ కూడా రాలేదు. హఠాత్తుగా విడిపోతున్నట్లు ప్రకటించారు ఐశ్వర్య- ధనుష్. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ సమ్మతితోనే విడిపోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇటీవల సెలబ్రెటీ కుటుంబాల్లో వరసగా విడిపోవడం కామన్ గా మారింది. అమిర్ ఖాన్ – కిరణ్ రావ్, నాగచైతన్య- సమంత ఇలా సెలబ్రెటి జంటలు విడిపోయాయి. తాజాగా ధనుష్- ఐశ్వర్య విడిపోయారు. అయితే ఈ మధ్యనే భారత ప్రభుత్వం ప్రకటించిన అవార్డులను మామ రజినీకాంత్, అల్లుడు ధనుష్ తీసుకున్నారు. ఆ సమయంలో కూడా భార్య ఐశ్వర్య, ధనుష్ పక్కన ఉంది. కేవలం కొన్ని రోజలు వ్యవధిలోనే ఈ షాకింగ్ నిర్ణయం తీసుకోవడం అందర్ని షాక్ గురించేంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…