General News

Crime News: దారుణ ఘటన.. పొట్టేలును నరకబోయి..! యువకుడి తల నరికేశాడు.. !

Crime News: సంక్రాంతి పండుగ సందర్భంలో ప్రతీ ఒక్కరి ఇంట్లో నాన్ వెజ్ ఉండాల్సిందే. కొంతమంది వారి ఆర్థిక స్థోమతకు తగ్గట్టుగా చికెన్, మటన్ , చేపలు ఇలా తెచ్చుకొని ఇంటిల్లిపాది తింటారు. అయితే కొన్ని పల్లెటూర్లలో ఒక నలుగురు.. ఐదుగురు కలిసి.. ఒక గొర్రెను కొనుక్కొని.. దానిని కోసుకొని.. భాగాలు వేసుకొని.. తీసుకుంటారు.

Crime News: దారుణ ఘటన.. పొట్టేలును నరకబోయి..! యువకుడి తల నరికేశాడు.. !

ఇలా ఆ గ్రామంలో ఆ గ్రామస్తులంతా పొట్టేలును కొనుక్కొని దానిని ఎల్లమ్మ గుడి దగ్గరకు తీసుకొచ్చారు. అక్కడ దానికి మొక్కలు చెల్లించుకొని.. అమ్మారికి ఆ పొట్టేలును బలి ఇచ్చేందుకు అన్నీ రెడీ చెసేశారు. ఇక బలి కార్యక్రమంలో అతడు పొట్టేలును నరకబోయి.. పక్కనే ఓ వ్యక్తి తలను నరికేశాడు.

Crime News: దారుణ ఘటన.. పొట్టేలును నరకబోయి..! యువకుడి తల నరికేశాడు.. !

ఆ యువకుడు అక్కిడిక్కడే గిలగిల కొట్టుకొని చనిపోయాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్లితే.. చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలోని వలసపల్లె గ్రామంలో ఆదివారం రాత్రి పశువుల పండుగ నిర్వహించారు.

కావాలనే చేశారా.. లేదా పొరపాటున జరిగిందా..

గ్రామానికి సమీపంలో ఉన్న ఎల్లమ్మ గుడికి చుట్టుప‌క్క‌ల ప్ర‌జ‌లంతా వెళ్లి పూజ‌లు నిర్వ‌హించారు . మొక్కుల్లో భాగంగా అమ్మవారికి బలి ఇచ్చేందుకు సురేష్ అనే యువ‌కుడు పొట్టేలును తీసుకొని వ‌చ్చాడు. అదే గ్రామానికి చెందిన చలపతి పొట్టేలుని నర‌క‌బోయి.. మద్యం మత్తులో సురేష్ తలను నరికేశాడు. దీంతో సురేష్ కు తీవ్ర రక్తస్రావం కాగా.. అక్కడే కుప్పకూలిపోయాడు. అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే చనిపోయాడు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చ‌ల‌ప‌తిపై హత్య కేసు నమోదు చేశారు. ఇక ఈ ఘటన కావాలనే చేశారా.. లేదా పొరపాటున జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇక ఈ సంక్రాంతి పండుగు బంధువులు, కొత్త అల్లుళ్లతో అంగరంగ వైభవంగా జరగాల్సింది పోయి.. ఇలా విషాదంలో గ్రామం మునిగిపోయింది. ఇక బాధితుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ల ఆర్తనాధాలు వర్ణించలేకుండా ఉన్నాయి. ఈ ఘటన ప్రతీ ఒక్కరినీ కన్నీళ్లు తెప్పిచ్చింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago