Crime News: సంక్రాంతి పండుగ సందర్భంలో ప్రతీ ఒక్కరి ఇంట్లో నాన్ వెజ్ ఉండాల్సిందే. కొంతమంది వారి ఆర్థిక స్థోమతకు తగ్గట్టుగా చికెన్, మటన్ , చేపలు ఇలా తెచ్చుకొని ఇంటిల్లిపాది తింటారు. అయితే కొన్ని పల్లెటూర్లలో ఒక నలుగురు.. ఐదుగురు కలిసి.. ఒక గొర్రెను కొనుక్కొని.. దానిని కోసుకొని.. భాగాలు వేసుకొని.. తీసుకుంటారు.

ఇలా ఆ గ్రామంలో ఆ గ్రామస్తులంతా పొట్టేలును కొనుక్కొని దానిని ఎల్లమ్మ గుడి దగ్గరకు తీసుకొచ్చారు. అక్కడ దానికి మొక్కలు చెల్లించుకొని.. అమ్మారికి ఆ పొట్టేలును బలి ఇచ్చేందుకు అన్నీ రెడీ చెసేశారు. ఇక బలి కార్యక్రమంలో అతడు పొట్టేలును నరకబోయి.. పక్కనే ఓ వ్యక్తి తలను నరికేశాడు.

ఆ యువకుడు అక్కిడిక్కడే గిలగిల కొట్టుకొని చనిపోయాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్లితే.. చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలోని వలసపల్లె గ్రామంలో ఆదివారం రాత్రి పశువుల పండుగ నిర్వహించారు.
కావాలనే చేశారా.. లేదా పొరపాటున జరిగిందా..
గ్రామానికి సమీపంలో ఉన్న ఎల్లమ్మ గుడికి చుట్టుపక్కల ప్రజలంతా వెళ్లి పూజలు నిర్వహించారు . మొక్కుల్లో భాగంగా అమ్మవారికి బలి ఇచ్చేందుకు సురేష్ అనే యువకుడు పొట్టేలును తీసుకొని వచ్చాడు. అదే గ్రామానికి చెందిన చలపతి పొట్టేలుని నరకబోయి.. మద్యం మత్తులో సురేష్ తలను నరికేశాడు. దీంతో సురేష్ కు తీవ్ర రక్తస్రావం కాగా.. అక్కడే కుప్పకూలిపోయాడు. అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే చనిపోయాడు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చలపతిపై హత్య కేసు నమోదు చేశారు. ఇక ఈ ఘటన కావాలనే చేశారా.. లేదా పొరపాటున జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇక ఈ సంక్రాంతి పండుగు బంధువులు, కొత్త అల్లుళ్లతో అంగరంగ వైభవంగా జరగాల్సింది పోయి.. ఇలా విషాదంలో గ్రామం మునిగిపోయింది. ఇక బాధితుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ల ఆర్తనాధాలు వర్ణించలేకుండా ఉన్నాయి. ఈ ఘటన ప్రతీ ఒక్కరినీ కన్నీళ్లు తెప్పిచ్చింది.





























