Featured

Allu Sirish: ఆహాతో నాకు ఏం సంబంధం లేదు..! హాట్ కామెంట్స్ చేసిన అల్లు శిరీష్..!

Allu Sirish: ఆహా ఓటీటీ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు. కరోనా కాలంలో చాలా మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తెలుగులో ఆహా ఓటీటీని తీసుకువచ్చారు.

Allu Sirish: ఆహాతో నాకు ఏం సంబంధం లేదు..! హాట్ కామెంట్స్ చేసిన అల్లు శిరీష్..!

లాక్ డౌన్ సమయంలో పలు మళయాళ, తమిళ సినిమాలను డబ్బింగ్ చేసి తెలుగు ఆడియన్స్ ను అలరించింది. తొలిరోజుల్లో కంటెంట్ తక్కువగా ఉన్నా.. ఆహాను ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు. తాజాగా పలు వెబ్ సిరీస్లు, సినిమాలను ఆహా ఆడియన్స్ ముందుకు తీసుకువస్తోంది.

Allu Sirish: ఆహాతో నాకు ఏం సంబంధం లేదు..! హాట్ కామెంట్స్ చేసిన అల్లు శిరీష్..!

త్వరలో తమిళ భాషలోకి కూడ ఎంట్రీ ఇవ్వబోతోంది. గతంలో కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నా… వాటన్నింటిని పరిష్కరించుకుని సరికొత్తగా ఆహా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. గతంలో విజయ్ దేవర కొండ ‘ఆహా’ ను ప్రమోట్ చేయగా… ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ బాధ్యతలను తీసుకున్నారు.

బిజినెస్‌ లో మెంబర్ అనుకొని..

ఇటీవల ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జరిగాయి. ఆహాలో అల్లు అర్జున్ తో పాటు, దిల్ రాజు, మైహోమ్ గ్రూప్ పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల అల్లు శిరీష్ సంచలన ట్విట్ చేశారు. ఆహాతో నాకు సంబంధం లేదని నేరుగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు.  ‘డియర్‌ ఆహా వీడియోస్‌ టీం… చాలా మంది నేను ‘ఆహా’ బిజినెస్‌ లో మెంబర్ అనుకొని.. ఆహాలో టెక్నికల్ సమస్యలు ఉన్నాయని నన్ను ట్యాగ్‌ చేస్తూ వస్తున్నారు. దయచేసి.. వారి సమస్యలను పరిష్కరించండి’’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఇది నిజమే కదా.. అల్లు ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అయినంత మాత్రాన.. ఆహా ఓటీటీ అల్లు శిరీష్ కి సంబంధించిందిగా భావించడం సబబుగా లేదు. సమస్యలను తీరాలంటే ఆహా టెక్నీకల్ టీం వల్లే సాధ్యం అవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 day ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago