Allu Sirish: ఆహా ఓటీటీ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు. కరోనా కాలంలో చాలా మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తెలుగులో ఆహా ఓటీటీని తీసుకువచ్చారు.

లాక్ డౌన్ సమయంలో పలు మళయాళ, తమిళ సినిమాలను డబ్బింగ్ చేసి తెలుగు ఆడియన్స్ ను అలరించింది. తొలిరోజుల్లో కంటెంట్ తక్కువగా ఉన్నా.. ఆహాను ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు. తాజాగా పలు వెబ్ సిరీస్లు, సినిమాలను ఆహా ఆడియన్స్ ముందుకు తీసుకువస్తోంది.

త్వరలో తమిళ భాషలోకి కూడ ఎంట్రీ ఇవ్వబోతోంది. గతంలో కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నా… వాటన్నింటిని పరిష్కరించుకుని సరికొత్తగా ఆహా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. గతంలో విజయ్ దేవర కొండ ‘ఆహా’ ను ప్రమోట్ చేయగా… ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ బాధ్యతలను తీసుకున్నారు.
బిజినెస్ లో మెంబర్ అనుకొని..
ఇటీవల ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జరిగాయి. ఆహాలో అల్లు అర్జున్ తో పాటు, దిల్ రాజు, మైహోమ్ గ్రూప్ పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల అల్లు శిరీష్ సంచలన ట్విట్ చేశారు. ఆహాతో నాకు సంబంధం లేదని నేరుగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. ‘డియర్ ఆహా వీడియోస్ టీం… చాలా మంది నేను ‘ఆహా’ బిజినెస్ లో మెంబర్ అనుకొని.. ఆహాలో టెక్నికల్ సమస్యలు ఉన్నాయని నన్ను ట్యాగ్ చేస్తూ వస్తున్నారు. దయచేసి.. వారి సమస్యలను పరిష్కరించండి’’ అంటూ ట్వీట్ చేశాడు. ఇది నిజమే కదా.. అల్లు ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అయినంత మాత్రాన.. ఆహా ఓటీటీ అల్లు శిరీష్ కి సంబంధించిందిగా భావించడం సబబుగా లేదు. సమస్యలను తీరాలంటే ఆహా టెక్నీకల్ టీం వల్లే సాధ్యం అవుతుంది.
Dear @ahavideoIN, lots of ppl tagging me thinking I'm involved with Aha. Kindly address the customer complaints. https://t.co/xbt4xkdfhr
— Allu Sirish (@AlluSirish) January 15, 2022
































