Samantha: మీడియాకు అడ్డంగా దొరికిపోయిన సమంత..! రెమ్యూనరేషన్ విషయంలో ఇంత ఘోరమా..!
Samantha: నాగచైతన్యతో విడాకుల అనంతరం నుంచి సమంత వరసపెట్టి సినిమాలు చేస్తోంది. విడాకులుకు ముందు అక్కినేని ఫ్యామిలీగా, నాగార్జున కోడలిగా, నాగచైతన్య భార్యగా సమంతకు కొన్ని పరిమితులు ఉండేవి. ఎప్పుడైతే విడాకుల వచ్చాయో అప్పటి నుంచి సమంత ఫ్రీ బర్డ్ అయిపోయింది.
వరసగా సినిమాలతో బిజీగా ఉంటోంది. ఇటీవల పుష్ప సినిమాలో ‘ ఊ అంటావా మావా ఊఊ అంటావా’ పాటతో మళ్లీ సిల్వర్ స్క్రీన్ కు కమ్ బ్యాక్ అయింది సమంత. ఈ పాట కూడా పెద్ద హిట్ సాధించింది. సమంత అందాలు, దేశీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మ్యాజిక్ తో పాట సూపర్ డూపర్ హిట్ అయింది.
యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ సంపాదించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం గుణశేఖర్ డైరెక్షన్ లో ప్యాన్ ఇండియా సినిమా ‘ శాకుంతలం’ చేస్తోంది. ‘యశోద’ అనే మరో సినిమా చేస్తోంది. మరికొన్ని సినిమాలు కూడా చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ కోసం దాదాపుగా నిర్మాతలు సమంతకు రూ. 1.5 కోట్లు ముట్టచెప్పారు. పూర్తి సినిమా చేసిన హీరోయిన్లకు కూడా ప్రస్తుత 2-3 కోట్లే ఇస్తున్నారు. అలాంటిది కేవలం ఓ ఐటెం సాంగ్ కోసం ఇంత మొత్తం ఇవ్వడం టాలీవుడ్ లో చర్చనీయాంశం అయింది. ఇదిలా సమంతకు ఇచ్చిన మొత్తం టాలీవుడ్ కు పెద్దదే అయినా… బాలీవుడ్ కు మాత్రం చిన్నదే అని చెప్పవచ్చు. అయితే ఇటీవల ఓ హిందీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ఐటెం సాంగ్ కు రూ. 5 కోట్లు తీసుకున్నట్లు చెప్పింది. ఈ మాత్రం తీసుకున్నా అని చెబితే రానున్న రోజుల్లో బాలీవుడ్ లో ఇంతకు మించి అడగొచ్చని సమంత లెక్కలేసుకున్నట్లు ఉంది. అయితే ఇది తెలిసిన బాలీవుడ్ సినీ ప్రముఖులు.. పుష్ప నిర్మాతలను ఆరా తీయగా.. మేం రూ. 1.5 కోట్లు మాత్రమే ఇచ్చామని చెప్పుకొచ్చారు. దీంతో బాలీవుడ్ మీడియా సమంతను ట్రోల్ చేయడం ప్రారంభించింది. బిల్డప్ కు పోయి అడ్డంగా బుక్కయింది సమంత
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…