Siri Hanmanth: కరోనా బారిన పడిన సిరి హన్మంత్..! హోం ఐసోలేషన్లో చికిత్స..!
Siri Hanmanth: బిగ్ బాస్ బ్యూటీ సిరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బిగ్ బాస్ సీజన్ 5 లో టాప్ 5 కంటెస్టెంట్ గా సిరి నిలిచింది. ఇదే కాకుండా షణ్ముఖ్ జశ్వంత్ తో కెమిస్ట్రీలో మరింత పాపులర్ అయింది. బిగ్ బాస్ హౌజ్ లో షన్నూతో కిస్సింగ్, హగ్గింగ్ లతో తెగ ఫేమస్ అయిపోయింది.
ఫ్రెండ్షిప్ కన్నా వీరిద్దరి మధ్య మరేదో రిలేషన్ ఉందని అనుకునేలా.. వీరిద్దరు చెలరేగిపోయారు. విజేతగా నిలవాల్సిన షన్నూ.. సిరి కారణంగా రన్నరప్ గా నిలిచారనే వాదనలు ఉన్నాయి. ఇదిలా ఉంటే షన్నూ- దీప్తి సునయన విడిపోవడానికి మెయిన్ విలన్ సిరినే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు, ట్రోలింగ్ లు నడిచాయి.
అయితే వీరిద్దరూ కూడా తాము మంచి ఫ్రెండ్స్ అని చెబుతున్నప్పటికీ.. వీరిద్దరి మధ్య బిగ్ బాస్ హౌజ్ లో నడిచిన ట్రాక్ ను బట్టి చూస్తే.. అలా అనిపించడం లేదు. ఇటు షన్నూ, దీప్తితో రిలేషన్ షిప్ లో ఉండగా… అటు సిరి కూడా శ్రీహాన్ తో రిలేషన్ షిప్ లో ఉంది.
బిగ్ బాస్ హౌజ్ లో జరిగిన సీన్లతో ఈరెండు జంటల మధ్య తేడాలు వచ్చాయి. ఇదిలా ఉంటే బిగ్ బాస్ బ్యూటీ సిరి హన్మంతుకు తాజాగా కరోనా పాజిటివ్ గా తేలింది. ఈవిషయాన్ని ఇన్ స్టా ద్వారా తెలియజేసింది ఈ అమ్మడు. స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్‌గా తేలిందని సిరి ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. హోం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…