బాలకృష్ణ, నాగార్జున కలిసి చేయాల్సిన సినిమాలు అందుకే ఆగిపోయాయా..?

సినీ పరిశ్రమలో కొన్ని సినిమాలు మొదట్లోనే ఆగిపోతుంటాయి. మరికొన్ని సినిమాలు పాత్రలను అనుకొని సెట్ మీదకు రాకుండానే క్యాన్సిల్ అవుతుంటాయి. అలాంటి వాటిలో ఎన్టీఆర్, ఏయ‌న్నార్‌ కలిసి నటించిన కల్ట్ క్లాసిక్ మూవీ గుండమ్మ కథని బాలకృష్ణ, నాగార్జునతో చేయాలనీ అనుకున్నారట. అయితే గుండమ్మ కథలో సూర్యాకాంతం పాత్ర చాలా కీలకమైనది.

అయితే ఆ పాత్ర చేసేవారు దొరక్కపోవడంతో ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లకుండానే ఆగిపోయింది. ఇలా 2011 సంవత్సరంలో కూడా మలయాళంలో హిట్ అయిన సినిమాను కూడా తెలుగులో రిమేక్ చేయాలని అనుకున్నారట బెల్లంకొండ సురేశ్. దానికి బాలయ్య, నాగార్జున కూడా ఓకె చెప్పేశారు. కానీ కొన్ని అనివార్యకారణాల వల్ల ఆ ప్రాజెక్టు కూడా ఆగిపోయిందట.

ఇక తర్వాత బెల్లంకొండ సురేశ్ నిర్మాతగా బాలయ్య హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో హరహర మహాదేవ సినిమాను తెరకెక్కించారు. కానీ ఆ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. అటు బాలకృష్ణతో పెయిర్ కుదరని నాగార్జున హరికృష్ణతో కలిసి సీతారామరాజు చిత్రంలో నటించారు. అంతేకాకుండా నాగార్జునతో కుదరని పెయిర్ వాళ్ల తండ్రి అక్కినేని నాగేశ్వరావుతో బాలయ్య కొన్ని సినిమాల్లో నటించారు. అవే గాంఢీవం, భార్యాభర్తల బంధం, శ్రీరామ రాజ్యం వంటి సినిమాల్లో నటించారు.

మొదటి తరం హీరోల్లో ఎన్టీఆర్, ఏఎన్ ఆర్ లు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. వాళ్ల వారసులతో ఇలాంటి పెయిర్ కూడా తీయాలని చూసిన నిర్మాతలకు కొన్ని కారణాల వల్ల కుదరలేదు. నాగార్జున, బాలయ్య కలసి చేయాల్సిన ఆ రెండు సినిమాలు ఆగిపోవడంతో కూడా అభిమానులు నిరాశలో ఉన్నారు. ఒకే స్క్రీన్ పై వీళ్లిద్దరిని చూడాలకున్న అభిమానుల ఆశలు ఇప్పటికీ నెరవేరలేదు.