గత కొన్ని రోజుల నుంచి చైతన్య, సమంతలు విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలు తెగ వైరల్ గా మారాయి. విడాకుల గోల తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఏ రోజు చూసిన ఏదో ఒక వార్తతో వాళ్లిద్దరు వార్తల్లో నిలుస్తున్నారు. మొన్న నాగచైతన్య లవ్ స్టోరీ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ట్విట్టర్ లో పోస్టు చేయగా.. దానికి రీ ట్వీట్ చేసిన సమంత ఆ అనుమానాలను ఇంకా రెట్టింపు చేసింది.
ఎందుకంటే.. అందులో చైతును ట్యాగ్ చేయకపోవడంతో నెటిజన్లు మళ్లీ అనుమానించారు. విడాకుల విషయం నిజమే అంటూ మళ్లీ వార్తలు వచ్చాయి. మొన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత వద్ద ఓ రిపోర్టర్ దీనిపై ప్రశ్నించగా.. బుద్ది ఉందా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే నాగ చైతన్య కూడా ఈ మధ్య ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే.. సమంత పేరు తీసుకురావద్దని ఒక కండీషన్ కూడా పెట్టాడు. దీంతో వారిద్దరి మధ్య విడాకులు నిజమే అంటే వైరల్ గా మారింది వార్త. అయితే మరో వార్త ఇప్పుడు చక్కెర్లు కొడుతోంది.
సమంత- నాగ చైతన్య వ్యవహారం విడాకుల వరకు వచ్చి ఫ్యామిలీ కోర్టులో కౌన్సిలింగ్ కూడా ఫినిష్ అయిందనే టాక్ నడిచింది. అయితే తాజాగా సామ్ చేసిన ఓ పోస్టుతో జనాల్లో ఓ క్లారిటీ వచ్చిందని తెలుస్తోంది. సెప్టెంబర్ 20 న తనకు స్పెషల్ అంటూ .. తన నాన్న పుట్టునరోజు వేడుకను గుర్తు చేసుకుంటూ నాగార్జున ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్టు చేశాడు. వెంటనే అక్కినేని కోడలు.. సమంత దానికి స్పందించారు. దానికి రీ ట్వీట్ ఇలా చేసింది.. ‘దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్’ అంటూ ట్వీట్ చేసింది. తర్వాత #iamnagarjuna అంటూ చెప్పింది.
దానికి ముందుగానీ వెనుక గానీ గౌరవ సూచికలు లేకుండా పోస్ట్ చేశారు. అంతక ముందు ఆమె ఏ పోస్టు చేసినా నాగార్జున మామా అంటూ పోస్టు చేసేది. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత ఆమె ఏమనుకుందో ఏమో 30 నిమిషాల వ్యవధిలోనే ఆ ట్వీట్ డిలీట్ చేసి మరో ట్వీట్ చేశారు. మళ్లీ ‘దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్’ అంటూ క్యాప్షన్ పెట్టింది. నాగార్జున ను యాష్ ట్యాగ్ చేస్తూ.. మామా అంటూ సంభోదించింది. దీనిపై కూడా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. మొదట అలా ట్వీట్ చేసి.. వ్యతిరేకత రాగానే మళ్లీ డిలీట్ చేసి మరో ట్వీట్ చేయడంతో మళ్లీ అనుమానాలు రేకెత్తాయనే చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…