Anuraga Devatha : ఎన్టీ రామారావు – బాలకృష్ణ కలిసి నటించిన ఈ చిత్రం.. విజయ పరంపరను కొనసాగించింది.!!

తమిళంలో విడుదలైన పదహారేళ్ళ వయసు మాతృకలో శ్రీదేవి నటించారు. దర్శకుడు రాఘవేంద్ర రావు ఆ సినిమా చూసిన తర్వాత అదే చిత్రాన్ని తెలుగులో రూపొందించాలనుకున్నారు. తెలుగులో కూడా శ్రీదేవినే హీరోయిన్ గా తీసుకున్నారు. “పదహారేళ్ళవయసు” చిత్రం తరువాత శ్రీదేవికి హీరోయిన్ గా అద్భుతమైన కమర్షియల్ బ్రేక్ వచ్చింది. ఎన్టీఆర్ పక్కన శ్రీదేవి హీరోయిన్ అనగానే ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ జయసుధ, జయప్రదలను పక్కనపెట్టి “వేటగాడు” చిత్రానికి ఎన్టీఆర్ తో జోడిగా శ్రీదేవిని తీసుకున్నారు. “వేటగాడు” చిత్రంతో ప్రారంభమైన ఈ కాంబినేషన్ అనేక విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించారు.

Anuraga Devatha : ఎన్టీ రామారావు - బాలకృష్ణ కలిసి నటించిన ఈ చిత్రం.. విజయ పరంపరను కొనసాగించింది.!!

1982లో బొబ్బిలిపులి, జస్టిస్ చౌదరి, అనురాగ దేవత ఈ మూడు చిత్రాల్లో ఒకే జోడీగా ఎన్టీఆర్, శ్రీదేవి ఇరగదీశారు. అదే సంవత్సరంలో వచ్చిన “నాదేశం” చిత్రంలో ఎన్టీఆర్ జయసుధ కలిసి నటించారు. “అనురాగ దేవత” 1982లో విడుదలైన తెలుగు చిత్రం. జీతేంద్ర, రీనారాయ్, తాళ్ళూరి రామెశ్వరి నటించిన హిందీ చిత్రం ‘ఆశా’ ఆధారంగా ఎన్.టి.ఆర్ సొంతంగా నిర్మించిన ఈ సినిమాకు పరుచూరి సోదరులు రచన చేశారు.

ఎన్.టి.ఆర్ లారీ ద్రైవర్. శ్రీదేవి పేరున్న గాయకురాలు. వారిరువురికి పరిచయం కలుగుతుంది. శ్రీదేవి అతన్ని ప్రేమిస్తుంది. ఐతే ఆ డ్రైవర్ కు అప్పటికే పెళ్లైపోయి ఉంటుంది (జయసుధ తో). ఒక ప్రమాదం వల్ల వారిరువురూ విడిపోతారు. జయసుధను ప్రమాదం నుండి బాలకృష్ణ కాపాడుతాడు. డ్రైవరు పట్ల ఆశ పెంచు కున్న శ్రీదేవి చివరలో రామారావు, జయసుధ కలవడంతో వంటరిగా మిగిలిపోతుంది.

1982 లో విడుదలైన తెలుగు చిత్రాల్లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన “బొబ్బిలి పులి” చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఆయన నటించిన “జస్టిస్ చౌదరి” “నా దేశం” ఆ తర్వాత వచ్చిన “అనురాగ దేవత” విజయవంతమైన చిత్రంగా నిలిచింది. అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న బాలకృష్ణకు ఈ సినిమా ఎంతగానో దోహద పడిందని చెప్పవచ్చు.