Anushka Shetty: అనుష్కను వెంటాడుతున్న విచిత్రమైన సమస్య… ఆ సమయంలో షూటింగ్ కూడా ఆపేస్తుందట?

Anushka Shetty: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె బాహుబలి సినిమా తర్వాత నిశ్శబ్దం వంటి సినిమాలో నటించిన పెద్దగా ఈ సినిమా గుర్తింపు తీసుకురాలేదు. ఇలా బాహుబలి సినిమా తర్వాత అనుష్కను సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటివరకు చూసింది లేదు.

ఇలా ఈమె అధిక శరీర బరువు పెరగడంతో శరీర బరువు తగ్గడం కోసం పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. అయితే తాజాగా ఈమె యువి క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ పోలిశెట్టి హీరోగా చేస్తున్న చిత్రంలో నటిస్తోంది. ఇందులో అనుష్క చెఫ్ పాత్రలో సందడి చేయబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికీ ఈమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది.

ఇకపోతే తాజాగా అనుష్కకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అనుష్క తన సమస్య గురించి బయట పెట్టారు.తనకు ఓ విచిత్రమైన సమస్య ఉందని ఆ సమస్య బారిన పడితే ఇక షూటింగ్ కూడా ఆపేయాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు.

Anushka Shetty: 15 నిమిషాల పాటు షూటింగ్ ఆపివేయాల్సిందే…

మరి అనుష్కను వెంటాడుతున్న ఆ సమస్య ఏంటి అనే విషయానికి వస్తే… అది నవ్వు. ఈమె ఒక్కసారి కనుక నవ్వితే ఆపకుండా సుమారు 15 నిమిషాల పాటు అలాగే నవ్వుతూ ఉంటారని, ఆ సమయంలో షూటింగ్ కూడా ఆపేయాల్సి వస్తుందని తెలియజేశారు. ఇలా 15 నిమిషాల పాటు అటూ ఇటూ తిరుగుతూ ఉంటానని ఓ సందర్భంలో అనుష్క తాను బాధపడుతున్న ఈ సమస్య గురించి స్వయంగా వెల్లడించారు. దీంతో ఈమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.