Movie News

Balakrishna: బాలయ్య డేట్స్ అడిగిన నిర్మాతలు… ఓ రేంజ్ లో ఫైర్ అయిన బాలకృష్ణ…. అదే కారణమా?

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన సినిమాలో షూటింగ్ విషయంలో చాలా క్రమశిక్షణగా ఉంటారని ఇదివరకే ఎంతోమంది ఆయనతో కలిసి పని చేసిన నటీనటులు దర్శక నిర్మాతలు ఆయన క్రమశిక్షణ గురించి షూటింగ్ పట్ల తనకున్నటువంటి నిబద్ధత గురించి తెలియజేశారు.ఇక బాలయ్య కూడా షూటింగ్ తొందరగా పూర్తి చేసుకుంటే అదే నిర్మాతలకు పెద్ద లాభాలను తెచ్చిపెడుతుందని విశ్వసిస్తారు.

ఈ క్రమంలోనే బాలకృష్ణ తన సినిమా షూటింగ్లో కనుక ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వరుస షూటింగులలో పాల్గొంటూ త్వరగా ఆ సినిమాను కంప్లీట్ చేస్తారు. కానీ ప్రస్తుతం మాత్రం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగు ఇప్పటికే ప్రారంభమై కొన్ని షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అయితే తదుపరి షెడ్యూల్ చిత్రీకరణ కోసం నిర్మాతలు బాలయ్యకు ఫోన్ చేసి డేట్స్ అడిగారట.

ఇలా నిర్మాతలు బాలయ్యకు ఫోన్ చేయడంతో బాలకృష్ణ వారిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారని తెలుస్తోంది.షూటింగ్ పట్ల ఎంతో క్రమశిక్షణగా ఉండే బాలయ్య ఇలా నిర్మాతలపై ఫైర్ అవ్వడానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం తారకరత్న అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో ఉన్నారు. దీంతో బాలయ్య ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు. తారకరత్న కోసం ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు.

Balakrishna:ఈ పరిస్థితులలో డిస్టర్బ్ చేయొద్దు….

తారకరత్న ఆరోగ్యం బాగుపడాలని ఎంతో తపిస్తునటువంటి బాలకృష్ణకు నిర్మాతలు ఫోన్ చేసి షూటింగ్ కి రావాలని చెప్పడంతో ఒక్కసారిగా ఫైర్ అవుతూ… ఇలాంటి పరిస్థితులలో తనని డిస్టర్బ్ చేయవద్దని నిర్మాతలకు క్లారిటీ ఇచ్చారట. దీంతో బాలయ్య అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ పడినట్టు అయింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago