Aparna Balamurali: విద్యార్థి ప్రవర్తన పై స్పందించిన హీరోయిన్ అపర్ణ బాలమురళి…. ఏమన్నారంటే?

Aparna Balamurali: సాధారణంగా హీరో హీరోయిన్లకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. వారి అభిమాన హీరో హీరోయిన్లతో కలిసి ఫోటో దిగాలని వారితో మాట్లాడాలని ఎంతోమంది అభిమానులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొంతమంది అభిమానులు హద్దులు మీది ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ క్రమంలో సెలబ్రిటీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. తాజాగా హీరోయిన్ అపర్ణ బాలమురళికి కూడా ఇలాంటి చేదు సంఘటన ఎదురయింది.

ఆకాశమే నీ హద్దురా సినిమాలో సూర్య సరసన నటించిన అపర్ణ బాలమురళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలా హీరోయిన్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన అపర్ణ బాలమురళి ఇటీవల లా కాలేజీలో జరిగిన ఒక కార్యక్రమంలో గెస్ట్ గా హాజరయ్యింది. ఈ క్రమంలో ఒక విద్యార్థి తన అభిమానిని అంటూ బలవంతంగా ఆమె చేయి పట్టుకుని లాగటమే కాకుండా ఆమె మీద చేయి వేయడానికి ప్రయత్నించాడు.

విద్యార్థి ఇలా ప్రవర్తించడంతో హీరోయిన్ చాలా ఇబ్బంది పడింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన గురించి హీరోయిన్ స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సంఘటన గురించి స్పందించిన అపర్ణ బలమురళి మాట్లాడుతూ… ఒక లా స్టూడెంట్ మహిళల పట్ల చాలా మర్యాదగా ప్రవర్తించాలి. అయితే లా చదువుతూ మహిళ అనుమతి లేకుండా వారిని తాకటం నేరం అని కూడా అతనికి తెలియదు.

Aparna Balamurali: నటికి క్షమాపణలు చెప్పిన కాలేజ్ యాజమాన్యం…

అందరిముందూ అభిమానిని అంటూ వచ్చి నా చేయి పట్టుకొని లాగటం మాత్రమే కాకుండా నాపై చేతులు వేయడానికి ప్రయత్నించాడు. ఒక లా స్టూడెంట్ ఇలా మహిళ పట్ల ప్రవర్తించటం సరైన పద్ధతి కాదని ఆమె తెలిపింది. ఇక హీరోయిన్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన విద్యార్థినిని సస్పెండ్ చేస్తూ కాలేజీ యాజమాన్యం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించి కాలేజీ యాజమాన్యం హీరోయిన్ కి క్షమాపణలు తెలియజేసినట్లు సమాచారం.