Aishwarya Rai: ప్రపంచ సంపన్నులలో ఒకరైన అంబానీ కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడి నిశ్చితార్థ వేడుక ముంబైలో ఘనంగా జరిగింది. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన చిన్న నాటి స్నేహితురాలైన రాధిక మర్చంట్ ని వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తాజాగా ముంబైలో అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ల నిశ్చితార్థ వేడుకని అంబానీ కుటుంబం చాలా ఘనంగా నిర్వహించింది.
ఈ నిశ్చితార్థ వేడుకకి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ నిశ్చితార్థ వేడుకకి ప్రముఖ వ్యాపారవేత్తలతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పాల్గొని సందడి చేశారు. ఈ నిశ్చితార్థ వేడుకలు దీపికా పదుకొనే, రణవీర్ సింగ్, సచిన్ అంజలి దంపతులతో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఈ నిశ్చితార్థ వేడుకలలో ఐశ్వర్యరాయ్ తో పాటు ఆమె కుమార్తె ఆరాధ్య బచ్చన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఐశ్వర్యరాయ్ ఎక్కడికి వెళ్లినా తన కుమార్తెను వెంటబెట్టుకొని వెళుతుంది. కూతురంటే ఐశ్వర్యరాయ్ కి చాలా ఇష్టం. ఇక ఇటీవల జరిగిన నిశ్చితార్థ వేడుకలలో పాల్గొన్న అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత ఆరాధ్య మీడియా ముందుకి వచ్చింది. ఈ వేడుకలలో ఆరాధ్య క్రీమ్ కలర్ అనార్కలి డ్రెస్ లో కుందనపు బొమ్మ లాగా మెరిసిపోతుంది.
ఐశ్వర్యరాయ్ పక్కన నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఆరాధ్య తల్లికి సమానంగా హైట్ ఉండటమే కాకుండా ఎంతో అందంగా ఉంది. దీంతో ఆరాధ్యని చూసిన వారు ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ కూతురు కూడా అందంలో తల్లికి ఏ మాత్రం తీసిపోవటం లేదని కామెంట్లు చేస్తున్నారు. అమితాబచ్చన్ మనవరాలిగా ఐశ్వర్యరాయ్ కూతురిగా సినిమా ఇండస్ట్రీలో ఇంతటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఆరాధ్య హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…