Tammareddy Bharadwaj: మీ ఎమ్మెల్యేలు చర్చకు సిద్ధమా..? ఎవరు ఏం దోచుకుంటున్నారో తేల్చుకుందాం రండి..!

Tammareddy Bharadwaj: మీ ఎమ్మెల్యేలు చర్చకు సిద్ధమా..? ఎవరు ఏం దోచుకుంటున్నారో తేల్చుకుందాం రండి..!

Tammareddy Bharadwaj: గత కొంత కాలంగా సినిమాకు సంబంధించి టికెట్ల వ్యవహారం అనేది వేడెక్కుతోంది. ఒకరిపై ఒకరు దూషించుకుంటూ సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్నారు. మొన్న సినిమా పరిశ్రమపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఖండించారు.

Tammareddy Bharadwaj: మీ ఎమ్మెల్యేలు చర్చకు సిద్ధమా..? ఎవరు ఏం దోచుకుంటున్నారో తేల్చుకుందాం రండి..!
Tammareddy Bharadwaj: మీ ఎమ్మెల్యేలు చర్చకు సిద్ధమా..? ఎవరు ఏం దోచుకుంటున్నారో తేల్చుకుందాం రండి..!

పెద్ద సినిమా హీరోలు టికెట్లను వేలల్లో అమ్ముకొని దోపిడీ చేస్తున్నారంటూ అతడు ఆరోపించాడు. దానిని అతడు తోసిపుచ్చుతూ.. ఎవరైనా కష్టపడితేనే డబ్బులు వస్తాయని.. దోచుకుంటే దొంగ అవుతాడు.. కానీ దొర కాడు అంటూ చెప్పాడు.

Tammareddy Bharadwaj: మీ ఎమ్మెల్యేలు చర్చకు సిద్ధమా..? ఎవరు ఏం దోచుకుంటున్నారో తేల్చుకుందాం రండి..!

మీ ఎమ్మెల్యేలు ప్రజలను ఎంతో దోచుకుంటున్నారో నిరూపించేందుకు నేను చర్చకు సిద్ధం. మీరు దీనికి సిద్ధమా అంటూ సవాల్ విసిరాడు. ఏపీలో టికెట్ల ధరల తగ్గింపుపై హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో తమ్మారెడ్డి మాట్లాడారు.

కుల ప్రస్తావన లేకుండా ప్రతిభ ఆధారంగా..

రాజకీయాల్లోకి వచ్చిన ప్రారంభంలో మీరు ఎలక్షన్ కమిషన్ కు చూపించన ఆస్తలు ఎన్ని.. ఇప్పుడు ఎన్ని అంటూ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ ను ఉద్దేశించి ప్రశ్నించాడు. సినిమా వెనుకాల ఎంతో మంది కష్టం ఉంటుందని.. కోట్లు పెట్టుబడి పెట్టి.. పైసా పైసా కూడబెట్టుకుంటారన్నారు. కానీ మీలాగా రూపాయి పెట్టుబడి పెట్టి.. రూ. కోట్లు దోచుకోవడం లేదన్నారు. చీప్ గా దొరికామని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దన్నారు. ఒకరిని విమర్శించే ముందు.. మీరు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలన్నారు. ఇప్పటి వరకు లేని కుల, మత రంగును సినిమా రంగానికి ఆపాదించడం సరికాదన్నారు. కుల ప్రస్తావన లేకుండా ప్రతిభ ఆధారంగా అవకాశాలిచ్చే ఒకే ఒక్క రంగం సినీ రంగమేనని పేర్కొన్నారు. ఇక సినిమా టికెట్ల ధరల నియంత్రణ అనే అధికారం ప్రభుత్వానికి ఉందని.. అయితే ప్రొడక్ట్ కు మాత్రం ధర నిర్ణయించే అధికారం మాకే ఉందన్నారు.అయితే ఆ హక్కును చట్టబద్దంగా సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక అసెంబ్లీని ఎలాగో నాశనం చేశారు.. టీవీలను ఎందుకు నాశనం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.