Artist MS Chowdary : నన్ను మెడ పట్టి బయటకు గెంటారు… మళ్ళీ తేజ బతిమాలి ఆ సినిమాలో చేయించాడు… ఆర్టిస్టులకు గౌరవం ఇవ్వండి…: నటుడు ఎంఎస్ చౌదరి

Artist MS Chowdary : నాటక రంగం నుండి వచ్చిన ఎంతో మందిలాగానే ఎంఎస్ చౌదరి గారు కూడా సినిమాల్లో నటించాలని భావించి ఇండస్ట్రీకి వచ్చారు. ఎన్నో ప్రొడక్షన్ హౌస్ ల వద్ద డైరెక్టర్స్ వద్ద అవకాశాల కోసం తిరిగి నేడు ఒక గుర్తింపు ఉన్న నటుడుగా పెద్ద ప్రాజెక్ట్స్ లో స్టార్ హీరోల సరసన నటినస్తున్నారు. భీమ్లా నాయక్ వంటి సినిమా మరింత గుర్తింపును తెచ్చిపెట్టగా తాజాగా ప్రభాస్ సలార్ సినిమాలో కూడా నటిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను మొదట్లో ఇండస్ట్రీలో ఎదుర్కొన్న అవమానలను గురించి వివరించారు.

ఆడిషన్స్ కి వెళితే గేట్ లోనే బయటికి పంపేవారు…

కృష్ణ వంశీ, తేజ వంటి దర్శకులు కొత్త వారిని తీసుకుని సినిమాలను చేసేవారు. అలా ఆడిషన్స్ కోసం స్నేహితులతో వెళితే వాళ్ళందరూ ఆడిషన్ ఇచ్చేవారు కానీ నన్ను మాత్రం లోనికి రానిచ్చేవారు కాదు. అలా చాలా సందర్భాల్లో జరిగింది అంటూ ఎంఎస్ చౌదరి తెలిపారు. ఇక కృష్ణ వంశీ గారి ఆడిషన్ కి వెళ్లగా అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్లు బాగా అవమానించారు.

కానీ అయన సినిమాలోనే మళ్ళీ మెయిన్ విలన్ గా నటించాను. ఇక తేజ గారి సినిమాల్లో కూడా మొదట ఆడిషన్ కోసం వెళితే గేట్ బయటే గెంటేసారు. కానీ మళ్ళీ కొద్ది కాలానికి ఆయనే నన్ను బతిమాలి ఆ క్యారెక్టర్ నువ్వే చేయాలని చెప్పి సినిమాలో పెట్టుకున్నారు. ఏ ఆర్టిస్ట్ లో ఎంత టాలెంట్ ఉందో ఎవరికీ తెలియదు. ఎవరికైనా టైమ్ రావాలి, అలా అని అవకాశం కోసం మీ ముందుకు వచ్చినపుడు అవమానించకండి అంటూ ఆర్టిస్టులకు గౌరవం ఇవ్వండి అంటూ చెప్పారు.