All posts by TD Admin

ఆకట్టుకుంటున్న ఈ కథలో పాత్రలు కల్పితం ట్రైలర్..!!

మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రాజేష్‌ నాయుడు నిర్మాతగా అభిరామ్ ఎమ్‌. దర్శకత్వంలో పవన్‌ తేజ్‌ కొణిదెల, మేఘన జంటగా నటిస్తున్న చిత్రం ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ మూవీ పోస్టర్స్‌‌కి, సాంగ్స్‌కి, టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. రోజు రోజు కి అంచనాలు పెరుగుతున్న ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుని మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు రిలీజ్ చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ దక్కగా, సెకండ్ లిరికల్ సాంగ్‌ను పొలిటికల్ సర్కిల్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోన్న వైఎస్ షర్మిల రిలీజ్ చేశారు. ఆ పాట కి మంచి స్పందన వచ్చింది.. ఇంకా ఈ చిత్ర రిలీజ్ డేట్ పోస్టర్ ను ఎమ్మెల్యే, కేబినెట్ మినిస్టర్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ రిలీజ్ చేశారు.. ముంబై లో ఉన్న పూరీజగన్నాధ్ ఇంటికి వెళ్లి చిత్ర యూనిట్ ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేశారు. కాగా ఈ కార్యక్రమంలో అంబర్ పేట్ శంకరన్న , అందాల నటి, నిర్మాత చార్మీ, పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పూరీ జగన్నాధ్ మాట్లాడుతూ.. ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ .. టైటిల్ చాలా వెరైటీ గా ఉంది. ట్రైలర్ కూడా బాగుంది. విజువల్స్ అదిరిపోయాయి..సినిమా కూడా చాలా బాగుంటుంది. వెరైటీ స్టోరీ తో రాబోతున్న సినిమా అని ట్రైలర్ చూస్తుంటేనే తెలుస్తుంది.. అభిరామ్ ఎమ్‌. దర్శకత్వం చాలా బాగుంది.. నిర్మాత రాజేష్‌ నాయుడు గారికి ఈ సినిమా ద్వారా మంచి లాభాలొచ్చి ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా నిర్మించాలని కోరుకుంటున్నాను.. పవన్‌ తేజ్‌ కొణిదెల, మేఘన చాల బాగా కనిపిస్తున్నారు. సినిమా ని అందరు చూడండి.. ఈ సినిమా కోసం కష్టపడ్డ టీం అందరికి అల్ ది బెస్ట్.. అన్నారు.

చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ సినిమా బాగా ఆడాలని కోరుకునే అందరికి నా కృతజ్ఞతలు.. మా ఆహ్వానాన్ని మన్నించి చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి ఒప్పుకున్న డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.. అలాగే ఈ సినిమా కి మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న గౌరవనీయులు సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, వైఎస్ షర్మిల గారికి, నాగబాబు కొణిదెల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.. ఈ సినిమా కి మీరు ఇచ్చిన సహాయ సహకారాలు మర్చిపోలేనివి.. అలాగే ఈ చిత్రం ఇంత బాగా రావడానికి సపోర్ట్ చేసిన అందరికి చిత్ర యూనిట్ తరపున హృద‌య‌పూర్వ‌క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అని అన్నారు.

మీలో ఎవరు కోటీశ్వరుడు కోసం ఎన్టీఆర్ ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో తెలుసా..?

ఎన్టీఆర్ ని బుల్లితెరపై చూడాలన్న కోరిక మరోసారి తీరుతుంది. బిగ్ బాస్ సీజన్ 1 తర్వాత ఎన్టీఆర్ బుల్లితెరపై కనిపించలేదు. దాంతో బుల్లితెర ఎన్టీఆర్ అభిమానులకు ఆయన్ని బుల్లితెరపై మళ్ళీ చూడాలన్న కోరిక అలాగే ఉండిపోయింది.. అయితే ఇన్నాళ్లకు అయన మళ్ళీ బుల్లితెరపై చూడాలన్న కోరిక ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ద్వారా నెరవేరుతుంది.. మా టీవీ లో ప్రసారమయినా మీలో ఎవరు కోటీశ్వరుడు షో కి సిమిలర్ గా ఉండే ఈ షో కి ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్నాడు.. ఈ వార్త ఎన్టీఆర్ అభిమానులను ఎంతో ఖుషి చేస్తుంది.

జెమిని ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లో ఏప్రిల్ నుంచి ఈ ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్నీ ఛానల్ యాజమాన్యం ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించింది. ఈ షో కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు షెరవేగంగా జరుగుతున్నాయి. తన సినిమాలతో పాటు ఈ షోకు కూడా డేట్స్ ఇచ్చేశాడు జూనియర్. ఇక టాక్ అఫ్ ది టౌన్ ఏంటంటే ఈ షో కి ఎన్టీఆర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనేదే.. సోషల్ మీడియా లో మాత్రం దీని గురించి తెగ ప్రచారం అవుతుంది..

ఒక్కో ఎపిసోడ్ కోసం కోటికి పైగానే రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడత తారక్.. ఇప్పటికే మొదలు కావాల్సిన ఈ షో కరోనా కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. సీజన్ 1 నుంచి దాదాపు రూ.30 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఈ షో వల్ల ఎంటర్ టైన్మెంట్ తో పాటు నాలెడ్జి కూడా ఉంటుండడంతో ఈ షో కి మంచి రేటింగ్స్ వస్తాయని భావిస్తున్నారు. దీనికోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు. షోను కూడా భారీ స్థాయిలోనే లాంఛ్ చేయబోతున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్ ఈ షో కి ఏవిధంగా ప్లస్ అవుతుందో చూడాలి.

హరిహర వీరమల్లు పవన్ కోసం రాసుకున్న కథ కదా..?

హరిహర వీరమల్లు గా పవన్ లుక్ మహా శివరాత్రి సందర్భంగా రిలీజ్ అయ్యింది. ఈ లుక్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన దక్కింది.. హరిహర వీరమల్లుగా పవన్ కళ్యాణ్ ఈ లుక్ లో ఓ రేంజ్ లో ఉన్నాడని అభిమానులు తెగ పొగిడేశారు… చారిత్రాత్మక లుక్ లో పవన్ కళ్యాణ్ ని చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదని సోషల్ మీడియా లో తెగ కామెంట్స్ చేస్తున్నారు.. ఇప్పటికే సోషల్ మీడియా పవన్ ఫాన్స్ హంగామా తగ్గలేదు.. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా టైటిల్ ని కూడా ఈ లుక్ లో రివీల్ చేశారు.

ఈ లుక్ పవన్ ఫాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వకీల్ సాబ్ తర్వాత సరైన అప్ డేట్ లేక అల్లాడిపోతున్న పవన్ ఫ్యాన్స్ కి ఈ లుక్ వచ్చాక పండగ చేసుకుంటున్నారు.. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ లో పవన్ కళ్లప్పగించి మరీ చూస్తున్నారు. ఇక వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాపై క్రిష్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. కొన్నాళ్లుగా క్రిష్ కెరీర్ లో సరైన హిట్టు పడలేదు.

ఎన్టీఆర్ బయోపిక్ కూడా నిరాశ పరిచింది. దీంతో పవన్ సినిమాతో కమర్షియల్ గా కూడా తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో కమర్షియల్ కథకు కావాల్సిన అన్ని అంశాలు మిక్స్ చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమా కథ పవన్ కోసం రాసుకున్నది కాదట. మెగాహీరో వరుణ్ తేజ్ కోసం ఈ కథ రాసుకున్నాడు దర్శకుడు క్రిష్.‘కంచె’ సినిమా తరువాత వరుణ్ తేజ్ తో మరో సినిమా చేయాలని భావించిన క్రిష్ ‘హరిహర వీరమల్లు’ కథను సిద్ధం చేశాడట. అయితే వరుణ్ మార్కెట్ కి.. ఈ సినిమా బడ్జెట్ సహకరించలేదట. వరుణ్ తేజ్ మార్కెట్ రేంజ్ కంటే రెండు, మూడింతలు సినిమా బడ్జెట్ ఎక్కువ అవుతుండడంతో ఈ కథను పక్కన పెట్టేశారట. చివరికి ఈ సినిమా పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు.

ఆసుపత్రి బెడ్ పై ఆక్సిజన్ తీసుకోలేని స్థితిలో ప్రముఖ నటుడు..సాయం కోసం ఎదురుచూపులు

సినిమా ఇండస్ట్రీ లో గడ్డు కాలం నడుస్తున్న రోజులివి. ఎక్కడ నుండి ఎలాంటి వార్త వస్తుందో తెలియని పరిస్థితి. గత ఏడాదిలో ఇప్పటికే 50 మందికి పైగా చనిపోయారు. రిషి కపూర్, ఎస్పీ బాలు, చిరంజీవి సర్జ, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లాంటి ప్రముఖులను కోల్పోయింది పరిశ్రమ. ఇక తాజాగా మరొక నటుడు పరిస్థితి పూర్తిగా విషమంగా మారి ఆసుపత్రిలో ఆర్థిక సహాయం చేస్తున్నాడు. తెలుగు తో సౌత్ ఇండియా లో పాపులర్ అయినా నటుడు పొన్నాంబళం ఆసుపత్రి బెడ్ పై నుండి తన ఆరోగ్య పరిస్థితి గురించి , అలాగే తాను పడుతున్న ఆర్థిక సమస్యల గురించి ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. గత ఐదేళ్ల నుండి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. సంపాదించినా మొత్తం ఆసుపత్రుల బిల్లులకే సరిపోయింది. ఇప్పుడు కిడ్నీ దాత దొరకడంతో ఆపరేషన్ చేసి కొత్త కిడ్నీ అమర్చబోతున్నారు.

ఇప్పటికే ఆసుపత్రైలో ఆక్సిజన్ కూడా పీల్చుకోలోనే స్థితిలో ఉన్న పొన్నాంబళం ని చూసి పలువురు సెలబ్రిటీ లు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. రజినీకాంత్, కమల్ హస్సన్ వంటి వారు తమ వంతు సంహాయం ప్రకటించగా, అటు నడిగర సంఘం, ఇటు మా అసోసియేషన్ తమ సహాయాన్ని ప్రకటించాల్సి ఉంది. ఇక పొన్నాంబళం కూతుళ్ళ చదువు బాధ్యత తీసుకోవాలని కమల్ హస్సన్ భావించి అతడి కుటుంబ సభ్యులతో చర్చించారు. రాధిక శ‌ర‌త్ కుమార్, ధనుష్, కె ఎస్‌ రవికుమార్, రాఘవ లారెన్స్‌, ఐసరి గణేష్‌ వంటి వారు థమన్ వంతుగా పొన్నాంబళంకి ఆర్థిక సహాయం చేస్తున్నారు.

గాంధీ గొప్ప లీడర్ కావచ్చు.. కానీ గొప్ప భర్త కాదు.. కంగనా సంచలన వ్యాఖ్యలు..?

కంగనా రనౌత్.. హీరోయిన్ అనేకంటే ఆమెకు వేరే బిరుదులూ చాలానే ఉన్నాయి.. కేరాఫ్ కాంట్రవర్సీ, ఫైర్ బ్రాండ్ అంటూ ఇలా ముద్దు పేర్లు చాలానే ఉన్నాయి. బాలీవుడ్ లో వివాదాలకు కేంద్ర బిందువు అయినా కంగనా రనౌత్ ఇటీవలే చేసిన హంగామా అంత ఇంతా కాదు. పొలిటికల్ సర్కిల్ లో కూడా ఆమె పేరు మారుమోగిపోయింది.. ఎప్పుడు ఎదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అవతలి వారికి కోపం తెప్పిస్తుంది.. మరి ఆమె కావాలని టార్గెట్ చేస్తుందో మరీ తెలియక చేస్తుందో తెలీదు కానీ జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

ఆమె నోటిదూలవల్ల ఆమెపై ముంబై లోని రాజకీయ వర్గాలు కూడా విపరీతమైన ఆరోపణలు చేసింది.. అక్కడి మున్సిపాలిటీ కూడా ఆమె ఆఫీస్ భవనాన్ని కూల్చివేసింది.. సుశాంత్ సూసైడ్ తో మొదలైన ఆమె పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది.. తాజాగా ఆమె జాతిపిత మహాత్మ గాంధీ ని కూడా వదల్లేదు.. ట్విట్ట‌ర్ వేదిక‌గా మ‌హాత్మా గాంధీలోని లోపాల‌ను ఎత్తి చూపించారు. ఆయ‌న గురించి ప‌లు సంద‌ర్భాల్లో రాసిన విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. త‌న పిల్ల‌ల‌కు అత‌ను మంచి తండ్రి కాలేక‌పోయార‌ని త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్‌లో రాశారు.

అంతే కాదు, ప‌లు సంద‌ర్భాల్లో మ‌హాత్మా గాంధి గురించి రాసిన ప‌లు విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. మ‌రీ ముఖ్యంగా ఆయ‌న త‌న స‌తీమ‌ణి ప‌ట్ల ఎలా దురుసుగా ప్ర‌వ‌ర్తించేవారో మాట్లాడారు. అతిథుల టాయ్‌లెట్ల‌ను శుభ్రం చేయ‌లేద‌ని త‌న భార్య‌ను ఆయ‌న ఎలా ఇంటి నుంచి గెంటేసేవారో చెప్పారు. ఇన్ని అవ‌ల‌క్ష‌ణాలున్న వ్య‌క్తిని ఒక దేశం క్ష‌మించింద‌ని, అత‌ను భ‌ర్త‌గా క‌రెక్ట్ గా లేకున్న‌ప్ప‌టికీ మ‌గాడు కాబ‌ట్టే అలా క్ష‌మించ‌గ‌లిగింద‌ని అన్నారు.మ‌న‌సులో ఏం తోచినా గ‌ట్టిగా మాట్లాడ‌టం కంగ‌నకు అల‌వాటు. అయితే ఏకంగా జాతిపిత మీద ఆమె చేసిన వ్యాఖ్య‌లు మాత్రం గ‌ట్టి దుమారాన్నే రేపుతున్నాయి మరి దీనిపై వచ్చే కామెంట్స్ కు ఆమె ఏ సమాధానం చెప్తుందో చూడాలి.

తాను చేసిన తప్పు వల్లే పెళ్లి తర్వాత మళ్ళీ సినిమాల్లోకి వచ్చా.. ప్రగతి..!!!

క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి తెలియని వారుండరు.. తెలుగు సినిమాలు రెగ్యులర్ గా చూసేవారికి ఆమె ప్రతిభ గురించి తెలిసే ఉంటుంది. అన్ని రకాల ఎమోషన్స్ ని పండించగల మంచి ఎమోషనల్ నటి ఆమె. అమ్మ పాత్రలో అయినా వదిన పాత్రలో అయినా యిట్టె ఒదిగిపోగలడు.. ప్రతి తెలుగు సినిమాలో ఈమెకు పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. చాలా సినిమాల్లో ఆమె కామెడీ చేస్తుంటే ఎంతో చూడముచ్చటగా ఉంటుంది..

ఇకపోతే గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియా లో ఆమె చేసే హడావుడి అంతాకాదు. లాక్‌డౌన్ వేళ ఇంట్లోనే ఉంటూ సామజిక మాధ్యమాలను ఊపేసిన ఆమె తన ఫాలోవర్స్‌ని అమాంతం పెంచుకొని అదే జోష్ కంటిన్యూ చేస్తూ ఫిట్‌నెస్‌పై స్పెషల్ కేర్ తీసుకుంటోంది.నాలుగు పదుల వయసులో ఉన్నా తన హాట్ హాట్ వర్కవుట్స్, డాన్స్ వీడియోలతో రచ్చ రచ్చ చేస్తుంటుంది ప్రగతి. అమ్మ పాత్రలకు, అక్క పాత్ర లకు, వదిన పాత్ర లు చేసే ప్రగతి ఇలా చేయడం అభిమానులకు, ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగిస్తున్న ఈరోజుల్లో అలా చేయకపోతే ఎవరు గుర్తుపెట్టుకుని పరిస్థితి లేదని ఆమె చెప్తుందట..

ఇక తాజగా ఆమె చేసిన ఓ పోస్ట్ అందరిని ఆలోచింపచేసేలా చేస్తుంది. ఆమె చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఓ యాడ్ షూట్ కోసం కెమెరా ముందుకొచ్చానని, ఆపై హీరోయిన్‌గా మారాక వెంటనే పెళ్లి చేసుకోవడంతో ఆ కెరీర్ అలాగే ముగిసిపోయిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రగతి వెల్లడించింది. మ్యారేజ్ తర్వాత తప్పని పరిస్థితుల్లో మళ్లీ సినిమాల్లోకి ఎంటరై చాలా కష్టపడ్డానని ఆమె చెప్పుకొచ్చింది. మొదట హీరోయిన్‌గా ఉన్నప్పుడు కష్టం విలువ తెలియలేదని, పెళ్లి తర్వాతనే కెరీర్‌ని సీరియస్‌గా తీసుకొని కష్టం అంటే ఏంటో తెలుసుకున్నానని ఎమోషనల్ అయింది. సో.. తాజాగా షేర్ చేసిన ఈ వీడియోపై చేసిన ట్యాగ్‌లైన్ ద్వారా కూడా అదే విషయాన్ని ఆమె మరోసారి చెప్పిందని అర్థమవుతోంది.

 

యాంకర్ రష్మీ కి ఆ హీరోయిన్ ఇంత పెద్ద హెల్ప్ చేసిందా..?

బుల్లితెరపై యాంకర్ రష్మీ ఓ సెన్సేషన్ చేసిందని చెప్పొచ్చు.. అసలు ఆమె యాంకర్ గా రంగ ప్రవేశం చేయడం కూడా చిత్రం గా జరిగిందని చెప్పొచ్చు.. జబర్దస్త్ కి మొదటిగ అనసూయ యాంకర్ గా ఉండగా ఏవో కారణాలతో ఆమె షో నుంచి తప్పుకుంది. అనూహ్యంగా రష్మీ ఆమె ప్లేస్ లో ఎంట్రీ ఇచ్చి పాతుకుపోయింది.. ఆ తర్వాత రెండు షో లు పెట్టి దానికొకరు దీనికొకరు యాంకర్ గా ఉంటున్నారు.. నిజానికి బుల్లితెరపై ఇప్పుడు టాలెంటెడ్ యాంకర్ లకు కొదువలేదు. ఒకప్పుడు యాంకర్ ఒక్క సుమవైపే చూసేవారు.. కానీ ఇప్పుడు యాంకర్ ల అషన్స్ పెరిగిపోయాయి..

వాక్చాతుర్యంతో పాటు గ్లామర్ చూపించే యాంకర్స్ అందుబాటులో ఉండడంతో బుల్లితెర కలర్ఫుల్ గా కనపడుతుంది.. అనసూయ, రష్మీ, వర్షిణి ఇలా చాలామంది యాంకర్స్ లైం లైట్ లోకి వచ్చేసి బుల్లితెర అర్థాన్నే మార్చేస్తున్నారు. ఇక వెండితెరపై మెరిసి ఆ తర్వాత బుల్లితెరపై దూసుకుపోతున్న రష్మీ ప్రస్తుతం పలు షో లతో ఫుల్ బిజీ గా ఉన్నారు. తాజగా ఆమె చేసిన తొలి చిత్రం గురించి గుర్తు చేసుకున్నారు. ఈమె మొట్టమొదటిగా హీరోయిన్ గా చేసిన సినిమా…కందేన్ అనే తమిళ చిత్రం.

ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. అయితే ఈ అవకాశాన్ని ఈమెకు హీరోయిన్ సంగీత ద్వారా దక్కింది. కానీ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినప్పటికీ రష్మిక మాత్రం మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. రష్మీ నటనకు మంచి గుర్తింపు దక్కుతోంది కానీ… ఈమెకు దశ తిరిగే రేంజ్ లో అవకాశాలు మాత్రం అందడం లేదు.ప్రస్తుతం రష్మి హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్. హీరో నందుతో కలసి ఈ మూవీలో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది మరి ఈ సినిమా హిట్ అయ్యి ఆమెకు సినిమాల్లో మరిన్ని ఛాన్స్ లు దొరుకుతాయా చూడాలి.

 

జాతిరత్నాలు మెచ్చిన చిరు..డైరెక్టర్ ని పిలిపించి?

జాతిరత్నాలు సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ ను తెచ్చుకుంది.. ఉప్పెన, నాంది సినిమాల తర్వాత ఆ రేంజ్ లో టాక్ తెచ్చుకున్న సినిమా ఇదే.. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తుందంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న ఈ సినిమా కి విజయ్ దేవరకొండ అతిధిగా రాగా, పలువురు ప్రముఖులు ఈ సినిమా కి అండగా నిలిచారు.. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీల‌క పాత్ర‌లో పోషించిన ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా న‌టించింది.

ప్రభాస్ కూడా ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు. దాంతో ఈ సినిమా పై ఒక్కసారిగా హైప్ వచ్చింది. మొదటినుంచి ఈ సినిమా ప్రమోషన్స్ ఎంతో వెరైటీ గా చేశారు యూనిట్.. ఇక దర్శకుడు గురించి చెప్పాలంటే ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయమయ్యాడు అనుదీప్.. మ‌రోవైపు సినీ ప్ర‌ముఖులు కూడా ఈ సినిమాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా డైరెక్ట‌ర్ అనుదీప్ కేవీకి బంప‌ర్ ఆఫ‌ర్ త‌గిలింది అంటున్నారు.

జాతిర‌త్నాలు ప్ర‌మోష‌న్స్‌లో.. మెగాస్టార్‌ చిరంజీవి అంటే తనకు ఎంతో ఇష్టమ‌ని దర్శకుడు అనుదీప్ చెప్పాడు. అంతేకాదు ఆయననే స్ఫూర్తిగా తీసుకుని సినీ ఇండస్ట్రీకి వచ్చానని అన్నాడు. అయితే ఇంతవరకు మెగాస్టార్‌ని కలిసే అవకాశం తనకు రాలేదని చెప్పుకొచ్చాడు. ఇక ఈ విష‌యం తెలుసుకున్న ప్ర‌ముఖ నిర్మాత అశ్వనీదత్.. వెంట‌నే మెగాస్టార్‌తో మీటింగ్‌కి ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. అందులో భాగంగా అశ్వనీదత్‌ దగ్గరుండి మరీ అనుదీప్‌ని మెగాస్టార్‌ దగ్గరకు తీసుకుపోనున్నారట.

 

పుష్ప లో అల్లు అర్జున్ ఊతపదం ఇదేనా..?

అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం పుష్ప.. సుకుమార్ దర్శకుడు.. రంగస్థలం లాంటి హిట్ తర్వాత సుకుమార్, అల వైకుంఠపురం లో సినిమా లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.. వీరి కాంబో లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే వీరి కాంబో లో ఆర్య, ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. దీంతో మూడో సినిమాపై సహజంగానే అంచనాలు ఉంటాయి..

ఇక ఈ సినిమా లో నటించే విలన్ పాత్ర కు ఎవరిని నటింపచేస్తున్నారో అన్నది ఇంకా సస్పెన్స్ గా ఉంచుతున్నారు.. మొదటి నుంచి రకరకాల పేర్లు వినిపిస్తున్న ఇప్పటికే ఎవరిని ఫైనల్ చేయలేదు.. ఎవరిని ఫైనల్ చేయలేదా చేసి దాస్తున్నారా అన్న విషయం అర్థం కావట్లేదు..రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉండబోతుంది. అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా నటించబోతున్నారు. ఈ సినిమా తో అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అని కాకుండా ఐకానిక్ మాస్టర్ అనిపించుకోబుతున్నదట..

ఇకపోతే పుష్ప లో అల్లు అర్జున్ ఒక మాస్ పదాన్ని ఉపయోగించాడు. సాధారణంగా ఎప్పుడూ క్లాస్ గా మాట్లాడే అల్లు అర్జున్ చావు కబురు చల్లగా అనే సినిమా ఫ్రీ ఈవెంట్ ఫంక్షన్ లో మాట్లాడుతున్న సమయంలో తగ్గేదే లే అని ఒక డైలాగ్ చెప్పాడు. అయితే ఇదే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఊత పదం అయి ఉంటుంది అని ప్రస్తుతం ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు కూడా ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ పదం కాస్త ట్రెండింగ్ అయిపోతుంది.

రకుల్ ని పెళ్లి చేసుకోవాలని యాభై ఏళ్ల వ్యక్తి ప్రపోజల్ పెట్టాడా..?

కొన్ని రోజులు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ప్రస్తుతం పెద్దగా సినిమాలేవీ లేవనిచెప్పాలి. వైష్ణవ తేజ్ రెండో సినిమా తప్పా రకుల్ ఏ హీరో సినిమాలో నటించట్లేదు.. వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తో టాలీవుడ్ కి పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ తొలి సినిమా తోనే మంచి సక్సెస్ కొట్టివాంటెడ్ హీరోయిన్ అయిపొయింది.. అనతి కాలంలో నే స్టార్ హీరోలతో నటిస్తూ టాప్ హీరోయిన్ అయిపొయింది.. ఎన్టీఆర్, మహేష్ వంటి స్టార్ హీరోలతో నటిస్తూ టాప్ హీరోయిన్ గా వెలుగొందింది.. అయితే పూజ హెగ్డే, రష్మిక మందన్న ఎంట్రీ తో ఆమెకు ఛాన్స్ లు తగ్గిపోయాయి.. చాలారోజుల తర్వాత ఇటీవలే విడుదల అయిన నితిన్ చెక్ సినిమా లో కనిపించిన రకుల్ కి ఆ సినిమా ద్వారా వచ్చిన ప్లస్ ల కంటే మైనస్ లే ఎక్కువ అని చెప్పాలి..

సినిమా ఫ్లాప్ కావడంతో రకుల్ కి ఏమంత పేరు కూడా రాలేదు. పోనీ సినిమాలో అన్నా బాగా కనిపించిందా అంటే అదీ లేదు.. మరి ఈ అమ్మడికి సినిమా ఆఫర్ లు ఎలా వస్తాయో చూడాలి. తాజగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మ్యారేజ్‌పై షాకింగ్‌ కామెంట్‌ చేసింది. తనకు యాభై ఏళ్ల వ్యక్తి నుంచి మ్యారేజ్‌ ప్రపోజల్‌ వచ్చిందని చెప్పింది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇటీవల మ్యారేజ్‌ విషయంలో స్పందిస్తూ ఫ్యాన్స్ విస్తూ పోయే విషయాన్ని వెల్లడించింది.ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇటీవల కపిల్‌ శర్మ టాక్‌ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా తాను సింగిల్‌గా ఉండటంపై అసంతృప్తిని వ్యక్తి చేసింది. ఒంటరిగా ఉండటం కాస్త ఇబ్బందిగా ఉందట.`దే దే ప్యార్‌ డే` సినిమా ప్రమోషన్‌ టైమ్‌లో ఓసారి కమిల్‌ శర్మ టాక్‌ షోలో పాల్గొంది రకుల్‌.

ఈ సందర్భంగా ఓ రూమర్‌ గురించి చెప్పారు. అది నిజమా కాదా చెప్పాల్సి ఉంటుంది.ఈ టాస్క్ లోనే రకుల్‌ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. `దే దే ప్యార్‌ దే` తర్వాత రకుల్‌కి 50ఏళ్ల వ్యక్తి నుంచి ప్రపోజల్‌ వచ్చిందనేది దాని సారాంశం.దీనిపై రకుల్‌ స్పందిస్తూ, అందుకే నేను ఇంకా సింగిల్‌గానే ఉన్నాను అని చెప్పింది రకుల్‌. `దే దే ప్యార్‌ దే`లో రకుల్‌ యాభై ఏళ్ల వ్యక్తిని ప్రేమిస్తుంది. యాభైఏళ్ల వ్యక్తిగా అజయ్‌ దేవ్‌గన్‌ నటించారు.ఇందులో ఆయనతో డేట్‌ చేయడం ఆసక్తికరంగా, టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. దీంతో రకుల్‌కి నిజజీవితంలో కూడా అలాంటి ప్రపోజల్స్ వచ్చాయని ఈ టాక్‌ షోలో వెల్లడించింది.అయితే తర్వాత ఆరా తీస్తే, ఇది నిజం కాదని, కేవలం ఆ టాక్‌ షోని రక్తికట్టించేందుకు మాత్రమే రకుల్‌ అలా చెప్పిందని అన్నారు. ఎంటర్‌టైన్‌ పంచడం కోసం అలా చేశారని కపిల్‌ శర్మ చెప్పారు.