Movie News

జాతిరత్నాలు మెచ్చిన చిరు..డైరెక్టర్ ని పిలిపించి?

జాతిరత్నాలు సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ ను తెచ్చుకుంది.. ఉప్పెన, నాంది సినిమాల తర్వాత ఆ రేంజ్ లో టాక్ తెచ్చుకున్న సినిమా ఇదే.. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తుందంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న ఈ సినిమా కి విజయ్ దేవరకొండ అతిధిగా రాగా, పలువురు ప్రముఖులు ఈ సినిమా కి అండగా నిలిచారు.. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీల‌క పాత్ర‌లో పోషించిన ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా న‌టించింది.

ప్రభాస్ కూడా ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు. దాంతో ఈ సినిమా పై ఒక్కసారిగా హైప్ వచ్చింది. మొదటినుంచి ఈ సినిమా ప్రమోషన్స్ ఎంతో వెరైటీ గా చేశారు యూనిట్.. ఇక దర్శకుడు గురించి చెప్పాలంటే ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయమయ్యాడు అనుదీప్.. మ‌రోవైపు సినీ ప్ర‌ముఖులు కూడా ఈ సినిమాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా డైరెక్ట‌ర్ అనుదీప్ కేవీకి బంప‌ర్ ఆఫ‌ర్ త‌గిలింది అంటున్నారు.

జాతిర‌త్నాలు ప్ర‌మోష‌న్స్‌లో.. మెగాస్టార్‌ చిరంజీవి అంటే తనకు ఎంతో ఇష్టమ‌ని దర్శకుడు అనుదీప్ చెప్పాడు. అంతేకాదు ఆయననే స్ఫూర్తిగా తీసుకుని సినీ ఇండస్ట్రీకి వచ్చానని అన్నాడు. అయితే ఇంతవరకు మెగాస్టార్‌ని కలిసే అవకాశం తనకు రాలేదని చెప్పుకొచ్చాడు. ఇక ఈ విష‌యం తెలుసుకున్న ప్ర‌ముఖ నిర్మాత అశ్వనీదత్.. వెంట‌నే మెగాస్టార్‌తో మీటింగ్‌కి ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. అందులో భాగంగా అశ్వనీదత్‌ దగ్గరుండి మరీ అనుదీప్‌ని మెగాస్టార్‌ దగ్గరకు తీసుకుపోనున్నారట.

 

TD Admin

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago