ఎన్టీఆర్ ని బుల్లితెరపై చూడాలన్న కోరిక మరోసారి తీరుతుంది. బిగ్ బాస్ సీజన్ 1 తర్వాత ఎన్టీఆర్ బుల్లితెరపై కనిపించలేదు. దాంతో బుల్లితెర ఎన్టీఆర్ అభిమానులకు ఆయన్ని బుల్లితెరపై మళ్ళీ చూడాలన్న కోరిక అలాగే ఉండిపోయింది.. అయితే ఇన్నాళ్లకు అయన మళ్ళీ బుల్లితెరపై చూడాలన్న కోరిక ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ద్వారా నెరవేరుతుంది.. మా టీవీ లో ప్రసారమయినా మీలో ఎవరు కోటీశ్వరుడు షో కి సిమిలర్ గా ఉండే ఈ షో కి ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్నాడు.. ఈ వార్త ఎన్టీఆర్ అభిమానులను ఎంతో ఖుషి చేస్తుంది.
జెమిని ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లో ఏప్రిల్ నుంచి ఈ ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్నీ ఛానల్ యాజమాన్యం ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించింది. ఈ షో కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు షెరవేగంగా జరుగుతున్నాయి. తన సినిమాలతో పాటు ఈ షోకు కూడా డేట్స్ ఇచ్చేశాడు జూనియర్. ఇక టాక్ అఫ్ ది టౌన్ ఏంటంటే ఈ షో కి ఎన్టీఆర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనేదే.. సోషల్ మీడియా లో మాత్రం దీని గురించి తెగ ప్రచారం అవుతుంది..
ఒక్కో ఎపిసోడ్ కోసం కోటికి పైగానే రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడత తారక్.. ఇప్పటికే మొదలు కావాల్సిన ఈ షో కరోనా కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. సీజన్ 1 నుంచి దాదాపు రూ.30 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఈ షో వల్ల ఎంటర్ టైన్మెంట్ తో పాటు నాలెడ్జి కూడా ఉంటుండడంతో ఈ షో కి మంచి రేటింగ్స్ వస్తాయని భావిస్తున్నారు. దీనికోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు. షోను కూడా భారీ స్థాయిలోనే లాంఛ్ చేయబోతున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్ ఈ షో కి ఏవిధంగా ప్లస్ అవుతుందో చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…