తీవ్ర దగ్గు సమస్యతో బాధపడుతున్నారా.. దానిమ్మ ఆకులతో ఇలా చేయండి?

సాధారణంగా వాతావరణంలో మార్పులకు అనుగుణంగా ఎన్నో సీజనల్ వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో చాలామంది దగ్గు సమస్యతో బాధపడుతుంటారు. అయితే ఎన్ని మందులు మాత్రలు వేసుకున్నా దగ్గు నుంచి ఉపశమనం ఉండదు.ఇలా తీవ్రమైన దగ్గు సమస్యతో బాధపడేవారికి దానిమ్మ ఆకులు ఒక చక్కటి పరిష్కార మార్గం అని చెప్పవచ్చు.

కేవలం దానిమ్మకాయలో మాత్రమే కాకుండా ఆకులు, బెరడులో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఆయుర్వేదంలో దానిమ్మ ఆకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దానిమ్మ ఆకులను ఉపయోగించి వివిధ రకాల చర్మ వ్యాధులను కూడా నయం చేసేవారు. తీవ్రమైన దగ్గు సమస్యతో బాధపడేవారు దానిమ్మ ఆకుల కషాయం తయారుచేసుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం తాగడంతో దగ్గు నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు.

అదేవిధంగా చర్మంపై ఏదైనా తామర పుండు వంటి సమస్యలతో బాధపడే వారు కూడా దానిమ్మ ఆకుల మిశ్రమాన్ని ఆ గాయంపై వేయటం వల్ల తొందరగా ఆ చర్మ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.అలాగే నోటి పూత సమస్యతో బాధపడేవారు దానిమ్మ ఆకుల రసాన్ని నీటిలో కలిపి పుక్కిలించడం వల్ల నోటి ఇన్ఫెక్షన్లు, నోటి పూత సమస్య, నోటి దుర్వాసన కూడా తొలగిపోతుంది.

అలాగే ఎవరైతే చెవి నొప్పి వంటి సమస్యలతో బాధపడతారో కొద్దిగా దానిమ్మ ఆకు రసంలోకి ఆవ నూనె,లేదా నువ్వుల నూనె కలిపి చెవిలో రెండు చుక్కలు వేసుకోవటం వల్ల తొందరగా చెవి ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలా ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి దానిమ్మ ఆకుల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.