అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నప్పుడే సిసింద్రీ సినిమా ద్వారా ఎంతో మందిని ఆకట్టుకున్న అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలలో నటించలేదనే చెప్పాలి. ఇదిలా ఉండగా అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా దసరా కానుకగా విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది.
ఈ క్రమంలోనే అక్కినేని కుటుంబం ఎంతో సంతోషంలో ఉన్నారు. నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ అఖిల్ బ్యాచిలర్ సినిమాలు విజయవంతం కావడంతో అక్కినేని కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ సందర్భంగా నాగార్జున ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అఖిల్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
అఖిల్ కడుపులో ఉన్నప్పుడు నాగార్జున అమలను అమెరికా తీసుకెళ్లి తనకు పరీక్షలు చేయించగా తనకు కూతురు పుడుతుందని డాక్టర్లు చెప్పడంతో నాగార్జున ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇలా డాక్టర్లు కూతురు పుడుతుందని చెప్పడంతో ముందుగానే కూతురు కావలసిన గౌన్లు, బొమ్మలను తెచ్చి పెట్టుకున్నారని తీరా డెలివరీ తర్వాత తనకు పాప కాదు బాబు పుట్టాడని తెలియడంతో నాగార్జున బాధపడినట్లు తెలిపారు.
తమకు పాప పుడితే నికిత అనే పేరు పెట్టాలని,తన పేరును కూడా ముందుగానే డిసైడ్ అయినట్లు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నాగార్జున తెలియజేశారు. అయితే నికిత ప్లేస్ లో అఖిల్ పుట్టాడని ఈ సందర్భంగా నాగార్జున తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…