సాధారణంగా క్షణికావేశంలో మనం ఏం చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితులలోకి వెళ్లి పోతాము. ఇలా క్షణికావేశంలో ఓ యువకుడు తన నాన్నమ్మ ప్రాణాలను బలి తీసుకున్న ఘటన బీహార్ రాష్ట్రంలోని ముజఫ్ఫర్‌పూర్‌లోని రక్ష గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన దిలీప్ అనే యువకుడు లారీ డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఇన్ని రోజులు పని నిమిత్తం బయటకు వెళ్లిన దిలీప్ దసరా పండుగ రోజు ఇంటికి వచ్చాడు.
అయితే తను ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంట్లో పలు మనస్పర్ధలు గొడవలు వల్ల మనశ్శాంతి లేకుండా పోయింది. దీంతో ఈ గొడవలు అన్నింటికీ కారణం తన నాన్నమ్మ అని గ్రహించిన దిలీప్ తన పై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే తన నానమ్మ ఉదయం ఇంటిముందు ముగ్గు వేస్తున్న సమయంలో దిలీప్ ఆవేశంతో తన లారీని తన నానమ్మ పై ఎక్కించాడు.
ఇలా ఈ ప్రమాదంలో తన నానమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ క్రమంలోనే తన తల్లి మరణించడంతో
దిలీప్ తండ్రి రాజేశ్వర్ రాయ్ తన కొడుకు దిలీప్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతురాలిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా తన ప్రమాదానికి ఉపయోగించిన లారీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…