Babu Mohan : ఎంతమంది ఉన్నా సినిమా ఇండస్ట్రీ పెద్ద దిక్కు ఆయనే.. వీళ్లంతా ఉన్నా ఎవరూ పెద్దగా పట్టించుకోరు : బాబు మోహన్

Babu Mohan : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకులు దాసరి నారాయణ రావు గారు బ్రతికున్నంత కాలం ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండేవారు. ఆయన మరణించాకే ఆ లోటు సినిమా ఆర్టిస్టులందరికీ బాగా తెలిసింది. ఏ చిన్న సమస్యకైనా, వివాదానికైనా ఆయన చొరవ తీసుకుని సర్థిచెప్పేవారని పేరు. ఇప్పటి వరకూ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న చాలా మంది సీనియర్ నటుల అభిప్రాయం అదే.

వాళ్ళు ఉన్నా అడిగితే సలహా ఇచ్చేవారు కానీ…

ఇప్పుడు ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే చర్చ సినిమా ఇండస్ట్రీ ఎక్కువగా జరుగుతోంది. ఇక ఇదే విషయం మీద ప్రముఖ కమెడియన్ బాబు మోహన్ మాట్లాడుతూ దాసరి గారిని గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీ లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రామానాయుడు, కృష్ణ ఇలా పెద్ద వాళ్ళు ఉన్నా దాసరి గారే పెద్ద దిక్కుగా వ్యవహారించారు. వీళ్లంతా పట్టించుకోరా సినిమా ఆర్టిస్టులను అంటే ఏదైనా సలహా అడిగినా సహాయం అడిగినా కాదనరు కానీ చొరవ చూపి ఒక సమస్యను పరిష్కరించలేదు. ఆ భాద్యత దాసరి గారు తీసుకున్నారు. ఒక ఇంట్లో నలుగురు ఉంటే అందరూ పెద్ద దిక్కు కాలేరు.

వయసు రీత్యా పెద్దరికంగా ఉండే వాళ్లు చెప్పినట్లు మొత్తం కుటుంబం నడుచుకుంటుంది. అలానే తెలుగు ఇండస్ట్రీ లో దాసరి గారు పెద్ద మనిషిలా వ్యవహరించి కార్మికులను, చిన్న ఆర్టిస్టులను పట్టించుకున్నారు. ఇప్పడు చిరంజీవి అలా పెద్ద దిక్కులా ఇండస్ట్రీ కి ఉన్నాడు అయితే దాసరి లేని లోటు ఎవరు భర్తీ చేయలేరు. ఇక బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వీళ్లంతా ఒక వయసు వాళ్ళు కావడం వల్ల పెద్దరికాన్ని అపాదించుకోలేరు అంటూ దాసరి నారాయణ రావు గారిని గుర్తు చేసుకున్నారు బాబు మోహన్.