Naga Chaitanya: నాగచైతన్యకు షాక్ ఇచ్చిన జూబ్లీహిల్స్ పోలీసులు.. భారీ జరిమానా ?!

Naga Chaitanya: కోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని ట్రాఫిక్ పోలీసులు ఎంతో స్ట్రిక్ట్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరైతే బ్లాక్ ఫిలిం ఉన్న కారులో ప్రయాణం చేస్తున్నారో వారి కార్లకు పెద్ద ఎత్తున జరిమానాలు విధిస్తూ కార్లకున్న బ్లాక్ ఫిలిం తొలగించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల కార్లను ఆపి పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు.

Naga Chaitanya: నాగచైతన్యకు షాక్ ఇచ్చిన జూబ్లీహిల్స్ పోలీసులు.. భారీ జరిమానా ?!
Naga Chaitanya: జూబ్లీహిల్స్ పోలీసుల నుంచి నాగచైతన్యకు చేదు అనుభవం… భారీ జరిమానా విధించిన పోలీసులు!

ట్రాఫిక్ రూల్స్ కి విరుద్ధంగా ఎవరు నడుచుకున్నా ఏ మాత్రం ఉపేక్షించకుండా వారికి పెద్ద ఎత్తున జరిమానాలు విధిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ హీరోలైన ఎన్టీఆర్, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, మనోజ్, డైరెక్టర్ త్రివిక్రమ్ వంటివారికి పోలీసులు చలాన విధించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ కోవలోకి నాగచైతన్య కూడా చేరిపోయారు.

Naga Chaitanya: జూబ్లీహిల్స్ పోలీసుల నుంచి నాగచైతన్యకు చేదు అనుభవం… భారీ జరిమానా విధించిన పోలీసులు!

హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద బ్లాక్ ఫిలిం ఉన్న కారులో ప్రయాణిస్తున్న నాగచైతన్య కారును ఆపిన పోలీసులు కారు మొత్తం సోదాలు నిర్వహించడమే కాకుండా కారుకి ఉన్న బ్లాక్ ఫిలిం తొలగిస్తూ అతనికి ఏడు వందల రూపాయలు జరిమానా విధించారు. అయితే పోలీసులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో కారులో నాగచైతన్య ఉండటం గమనార్హం.

కోర్టు ఆదేశాల మేరకే…

ప్రస్తుతం నాగచైతన్యకు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుత కాలంలో జరుగుతున్న దాడులు, కిడ్నాప్ వంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని, వాటిని అదుపు చేయటం కోసం కోర్టు కార్లకు బ్లాక్ ఫిలిం తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలమేరకే బ్లాక్ ఫిలిం ఉన్న కార్లకు పెద్ద ఎత్తున ఫైన్ వేయడమే కాకుండా, బ్లాక్ ఫిలిం తొలగిస్తున్నారు.