Success Story: రూ.50 వేలతో చేసిన ప్రయత్నం నేడు 20 కోట్లకు చేరింది…ఈ విజయం వెనుక ఎన్నోనిందలు, అవమానాలు.. దీప్తి సక్సెస్ స్టోరీ!
Success Story: సాధారణంగా చాలా మందికి వ్యాపారం చేయాలని ఎంతో ఆశగా, ఇష్టం ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా మంది వ్యాపార రంగంలోకి అడుగు పెట్టి ఎన్నో నష్టాలను చవి చూస్తూ ఉంటారు. ఇలా వ్యాపారం పై ఉన్న మక్కువతో వ్యాపారంలోకి అడుగు పెట్టారు 24 సంవత్సరాల దీప్తి. మరొకరితో కలిసి ఈవెంట్ వ్యాపారాన్ని ప్రారంభించిన దీప్తి మొదట్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది.
ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ కోర్సు పూర్తిచేసి సిఎ చదువుతున్న దీప్తి వ్యాపారంపై మక్కువతో వ్యాపార రంగం వైపు అడుగులు వేసింది. కేవలం 50 వేల రూపాయల పెట్టుబడితో తన వ్యాపారాన్ని ప్రారంభించిన ఈమె నేడు 20 కోట్ల టర్నోవర్ సాధిస్తోంది.అయితే ఈ విజయం వెనుక ఎన్నో అవమానాలు, నిందలు కూడా ఉన్నాయని దీప్తి వెల్లడించారు.
మరొకరి భాగస్వామ్యంతో ఈవెంట్ వ్యాపారంలోకి అడుగు పెట్టిన దీప్తి డిసెంబర్ 31 2014 లో ఢిల్లీలో జరిగిన అతిపెద్ద ఈవెంట్ బాధ్యతలను తనకు అప్పగించారు. ఇక ఈ ఈవెంట్ కిపెద్ద ఎత్తున ముఖ్య అతిథులు రావాల్సి ఉండగా వాళ్ళు ఎవరూ రాలేదు దీంతో ఈ కార్యక్రమానికి స్పాన్సర్లు, మరొక భాగస్వామి కూడా చేతులెత్తేయడంతో టికెట్లు అమ్ముడు పోక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.
ఇలా ఎవరూ ముందుకు రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో తన సొంత డబ్బును పెట్టుబడిగా పెట్టి ఆ ఈవెంట్ నిర్వహించారు.ఆ ఈవెంట్ కోసం చివరికి తన సొంత ఇంటిని అమ్ముకొని రోడ్డుపై పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా రోడ్డుపైకి రావడంతో తనతో పాటు తన తల్లిదండ్రులను కూడా ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారని దీప్తి వెల్లడించారు. ఇక తన తల్లిదండ్రుల విన్నపం మేరకు వికాస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ అయ్యారు.
దీప్తికి ఉన్న కలలు, కోరికలు తెలుసుకున్న వికాస్ తనని తిరిగి వ్యాపారం చెయ్యమని ప్రోత్సహించారు.2016లో రూ.50 వేలతో డిజిటల్ హోర్డింగ్ అనే వ్యాపారాన్ని ప్రారంభించి ఈ వ్యాపారంలో రోజురోజుకు అభివృద్ధి చెందుతూ నేడు 20 కోట్ల టర్నోవర్ సాధిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…