Featured

D Ramanaidu : మొదటి సినిమాకే నష్టం.. ఎన్టీఆర్ తో నిర్మిస్తున్న సినిమా గనుక పోయిందంటే ఇక ఇంటి దారే.. కట్ చేస్తే మూవీ బ్లాక్ బస్టర్.!!

వాహినీ స్టూడియో అధినేత నాగిరెడ్డి మొదటగా నిర్మించిన “షావుకారు” చిత్రానికి కూడా పేరైతే వచ్చింది కానీ కాసులు రాబట్టలేకపోయింది. అలా మొదటి చిత్రాలు కలిసిరాని నిర్మాతలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి సందర్భమే డి.రామానాయుడు కూడా ఎదురయ్యింది. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా ‘నమ్మినబంటు’ సినిమా షూటింగ్ తమ సొంత ఊరు కారంచెడు లోనే జరుగుతుండగా డి.రామానాయుడు అక్కడికి వెళ్లారు. ఆ చిత్రాన్ని తమ ఊరివారు పైగా తమ బంధువులే నిర్మిస్తున్నారని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు.

కొన్ని వ్యాపారాలు కొనసాగిస్తున్నప్పటికీ ఎందుకో సినిమాలో కొంత పెట్టుబడి పెట్టాలనుకున్నారు. అలా ‘నమ్మినబంటు’ చిత్ర నిర్మాతలను కలిసి తన కోరికను చెప్పడం జరిగింది. అప్పుడు రామానాయుడుది చిన్న వయసు కావున తక్కువ వాటాతో సినిమాల్లో పెట్టుబడి పెట్టమని సలహా ఇవ్వడం జరిగింది. అలా ‘నమ్మినబంటు’ చిత్రానికి రామానాయుడు కొంత పెట్టుబడి పెట్టారు. ఆ క్రమంలో చిత్ర నిర్మాణానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడం నటీనటులకు సంబంధించిన భోజన ఇత్యాది కార్యక్రమాలను చూడటం లాంటివి చేయడం జరిగింది. పైగా షూటింగ్లో వాడిన ఎద్దులను కూడా రామానాయుడు తన సొంతవే కావడం జరిగింది. ఆ తర్వాత రైస్ మిల్స్ పై ఇన్ కమ్ టాక్స్ వారు రైడ్ చేయడం, రామానాయుడు కి నోటీసులు ఇవ్వడం లాంటివి జరిగాయి.

వ్యవసాయం 100 ఎకరాలు ఉన్నప్పటికీ వాటిని ఎంత సాగుచేసిన పెద్దగా లాభాలు వచ్చేవి కావు. ఎవరో సలహా మేరకు తన పెదనాన్న మద్రాసులో ఉండడం వలన అక్కడికి వెళ్లి ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకున్నాడు. ఆ క్రమంలో మద్రాసు ప్రయాణమై ‘అనురాగం’ అనే సినిమాలో 50వేల రూపాయల పెట్టుబడి పెట్టడం జరిగింది. కానీ ఆ సినిమా పరాజయం చెందింది. తిరిగి కొత్త సినిమా ప్రారంభిద్దాం అంటే ‘అనురాగం’ చిత్ర నిర్మాతలు ఎవరు కూడా ముందుకు రాలేదు. ఆ క్రమంలో డి రామానాయుడు వారి నాన్న గారిని అడుగుదాం అనుకుంటే మొదట పెట్టిన 50 వేల రూపాయలు తిరిగిరాలేదు.

మళ్ళీ ఎలా అడగాలని మొహమాట పడ్డారు. తన స్నేహితులు, బంధువుల సహకారంతో కొత్తగా సినిమా నిర్మించాలనుకున్నారు. ఇక ఈ సినిమా తన భవిష్యత్ సినీ జీవితం పైన ఆధారపడి ఉందని భావించారు. ఒకవేళ ఈ చిత్రం కనుక పరాజయం పొందితే కచ్చితంగా ఇంటికి తిరుగుముఖం పట్టి వారి నాన్న గారు చెప్పిన విధంగా వ్యవసాయం చూసుకోవడమే ఇక తరువాయని భావించి ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేశారు.

1963లో సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించి, తాపీ చాణక్య దర్శకత్వంలో ఎన్టీరామారావు, జమున, విజయలక్ష్మి హీరో, హీరోయిన్లుగా ‘రాముడు భీముడు’ అనే చిత్రాన్ని 1964 మే 21న చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది. పెండ్యాల నాగేశ్వరరావు అందించిన “తెలిసిందిలే నెలరాజా నీ రూపు తెలిసిందిలే..” ఉందిలే మంచి కాలం ముందు ముందునా..అందరూ సుఖపడాలి నందానందానా”… అనే పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమా మొదటి రోజు నుండే హిట్ టాక్ రావడం జరిగింది. అలా తాను మొదటి సినిమాలో పెట్టుబడి పెట్టిన డబ్బులతో పాటు లాభాలు కూడా ‘రాముడు భీముడు’ అనే చిత్రం తీసుకువచ్చింది. ఆ తర్వాత ప్రేమ్ నగర్, జీవనతరంగాలు, సోగ్గాడు, దేవత, అహ నా పెళ్ళంట‌ మొదలగు చిత్రాలు నిర్మించారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సీఎస్‌కేకు మరో షాక్.. ఖలీల్ అహ్మద్ టోర్నీ నుంచి ఔట్

ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…

6 minutes ago

హైకోర్టులో స్వయంగా వాదించిన రఘురామ.. ఆకివీడు రామాలయం కేసులో ట్విస్ట్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…

24 minutes ago

మునగాకు పొడి మాయలు.. ఈ సమస్యలకు సులభ పరిష్కారం!

ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…

31 minutes ago

నిద్రలేవగానే బెడ్ సర్దేస్తున్నారా? ఉదయం ఈ ఒక్క అలవాటు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందా?

ఉదయం నిద్రలేవగానే బెడ్‌ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…

55 minutes ago

రుణబాధలు తగ్గాలా? వైశాఖ అమావాస్య రోజు తప్పక చేయాల్సినవి!

2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…

2 hours ago

‘బీజేపీ అహంకారానికి ఈ మంటలే సమాధానం’.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…

3 hours ago