Featured

Flash Back : వేదిక పై ఏడ్చేసిన jr ఎన్టీఆర్…. బాబాయ్ చేతుల మీదుగా అవార్డు తీసుకుంటూ ఉద్వేగానికి లోనైనా సందర్బం.. ఫ్యాన్స్ కు గుర్తుండిపోయిన సంఘటన…!

Emotional movement in NTR ‘s career : జూనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా పరిశ్రమలోకి నందమూరి నట వారసుడిగా అడుగు పెట్టినప్పటికీ తన కుటుంబం నుంచి తనకు సపోర్ట్ దొరకలేదు. నందమూరి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ ను దగ్గరకు రానివ్వలేదు. వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా కూడా తన నటనతో ప్రతిభతో ఎదిగాడు జూనియర్ ఎన్టీఆర్. తాత లా ఉండే రూపం తనకు కలిసొచ్చింది. ఇక నటనలో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు.నిన్ను చూడాలని,స్టూడెంట్ నెంబర్ వన్, సుబ్బు సినిమాల తర్వాత ఎన్టీఆర్ పేరు ఓ మోస్తరుగా ఆంధ్రప్రదేశ్లో వినిపించింది. అయితే ఈ గుర్తింపు ఎన్టీఆర్ కు అంత సులభంగా రాలేదు. తన కఠోర శ్రమ,ప్రతిభతో తెచ్చుకున్నాడు. తన నటన డాన్సులు ఫైట్ల విషయంలో తాతకు తగ్గ మనవడిని నిరూపించుకున్నాడు. తల్లిచాటు బిడ్డ గానే ఎన్టీఆర్ పెరిగాడు. తనను నందమూరి కుటుంబం దూరం పెట్టడంతో కసిగా తనని తాను నిరూపించుకున్నాడు. వారసుడిగా సినిమాల్లోకి అడుగు పెట్టిన కష్టపడి పైకొచ్చిన వాడిగా ఎన్టీఆర్‌ను సినీ పరిశ్రమలు అందరూ అంటారు.

బాబాయ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నప్పుడు ఉద్వేగానికి లోనైన ఎన్టీఆర్….

ఇక ఎన్టీఆర్ మూడో చిత్రం సుబ్బు తర్వాత కొంచెం కొంచెంగా నందమూరి అభిమానులు ఎన్టీఆర్ గురించి చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఇక ఆ సమయంలోనే ఎన్టీఆర్ జీవితంలో ఒక మరపురాని సంఘటన జరిగింది. ఈ సంఘటనను నందమూరి అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. 2001 సినీ గోయర్స్ అవార్డుకు ఎన్టీఆర్ ఎంపికయ్యారు. ఇక అవార్డు ఇవ్వడానికి వచ్చిన అతిథి ఎవరో కాదు నందమూరి బాలకృష్ణ అలాంటి క్షణం కోసం ఎదురుచూస్తోన్న జూనియర్ ఎన్టీఆర్‌కు మాటలు రావడం లేదు. స్టేజ్‌ మీదకు వచ్చిన బాలయ్య ఎన్టీఆర్ కు అవార్డ్ అందజేసి ఎన్టీఆర్‌పై చేయి వేశాడు. వారిద్ద‌రినీ పక్కప‌క్కనే చూడ‌డానికి అభిమానులకు రెండు కళ్ళు సరిపోలేదు . ఎంతోకాలంగా బాబాయ్ అబ్బాయ్ లను పక్కపక్కన అభిమానులు ఆశపడ్డారు.

ఉద్వేగానికి లోనైన అభిమానుల చప్పట్లు, ఈలలతో సభప్రాంగణం మొత్తం మారుమ్రోగింది.ఇక అభిమానుల పరిస్థితే అలా ఉంటే ఎప్పటినుండో అలాంటి ఒక సంఘటన కోసం ఎదురుచూస్తోన్న ఎన్టీఆర్ పరిస్థితి ఇక మాటల్లో చెప్పలేము.అంతే వేదిక మీదే కన్నీరు పెట్టుకున్నాడు.ఇక బాలయ్య కూడా ఉద్వేగానికి గురయ్యాడు. ఎన్టీఆర్ వెంట‌నే తేరుకొని అప్ప‌టికీ ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ మా బాబాయ్ బాల‌కృష్ణ కింగ్ అని చెప్పారు. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉండ‌డానికి కార‌ణం తాతయ్య నంద‌మూరి తార‌క‌రామారావు, మా నాన్న హ‌రికృష్ణ‌, మా బాబాయ్ బాల‌కృష్ణ అని చెప్పాడు . ఇక బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ తో ప్రేమగా మాట్లాడటం… ఆ ఉద్వేగపూరిత క్షణాలను నందమూరి అభిమానులు ఎప్పటికి మరచిపోలేరు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago