వాహినీ స్టూడియో అధినేత నాగిరెడ్డి మొదటగా నిర్మించిన “షావుకారు” చిత్రానికి కూడా పేరైతే వచ్చింది కానీ కాసులు రాబట్టలేకపోయింది. అలా మొదటి చిత్రాలు కలిసిరాని నిర్మాతలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి సందర్భమే డి.రామానాయుడు కూడా ఎదురయ్యింది. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా ‘నమ్మినబంటు’ సినిమా షూటింగ్ తమ సొంత ఊరు కారంచెడు లోనే జరుగుతుండగా డి.రామానాయుడు అక్కడికి వెళ్లారు. ఆ చిత్రాన్ని తమ ఊరివారు పైగా తమ బంధువులే నిర్మిస్తున్నారని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు.

కొన్ని వ్యాపారాలు కొనసాగిస్తున్నప్పటికీ ఎందుకో సినిమాలో కొంత పెట్టుబడి పెట్టాలనుకున్నారు. అలా ‘నమ్మినబంటు’ చిత్ర నిర్మాతలను కలిసి తన కోరికను చెప్పడం జరిగింది. అప్పుడు రామానాయుడుది చిన్న వయసు కావున తక్కువ వాటాతో సినిమాల్లో పెట్టుబడి పెట్టమని సలహా ఇవ్వడం జరిగింది. అలా ‘నమ్మినబంటు’ చిత్రానికి రామానాయుడు కొంత పెట్టుబడి పెట్టారు. ఆ క్రమంలో చిత్ర నిర్మాణానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడం నటీనటులకు సంబంధించిన భోజన ఇత్యాది కార్యక్రమాలను చూడటం లాంటివి చేయడం జరిగింది. పైగా షూటింగ్లో వాడిన ఎద్దులను కూడా రామానాయుడు తన సొంతవే కావడం జరిగింది. ఆ తర్వాత రైస్ మిల్స్ పై ఇన్ కమ్ టాక్స్ వారు రైడ్ చేయడం, రామానాయుడు కి నోటీసులు ఇవ్వడం లాంటివి జరిగాయి.

వ్యవసాయం 100 ఎకరాలు ఉన్నప్పటికీ వాటిని ఎంత సాగుచేసిన పెద్దగా లాభాలు వచ్చేవి కావు. ఎవరో సలహా మేరకు తన పెదనాన్న మద్రాసులో ఉండడం వలన అక్కడికి వెళ్లి ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకున్నాడు. ఆ క్రమంలో మద్రాసు ప్రయాణమై ‘అనురాగం’ అనే సినిమాలో 50వేల రూపాయల పెట్టుబడి పెట్టడం జరిగింది. కానీ ఆ సినిమా పరాజయం చెందింది. తిరిగి కొత్త సినిమా ప్రారంభిద్దాం అంటే ‘అనురాగం’ చిత్ర నిర్మాతలు ఎవరు కూడా ముందుకు రాలేదు. ఆ క్రమంలో డి రామానాయుడు వారి నాన్న గారిని అడుగుదాం అనుకుంటే మొదట పెట్టిన 50 వేల రూపాయలు తిరిగిరాలేదు.

మళ్ళీ ఎలా అడగాలని మొహమాట పడ్డారు. తన స్నేహితులు, బంధువుల సహకారంతో కొత్తగా సినిమా నిర్మించాలనుకున్నారు. ఇక ఈ సినిమా తన భవిష్యత్ సినీ జీవితం పైన ఆధారపడి ఉందని భావించారు. ఒకవేళ ఈ చిత్రం కనుక పరాజయం పొందితే కచ్చితంగా ఇంటికి తిరుగుముఖం పట్టి వారి నాన్న గారు చెప్పిన విధంగా వ్యవసాయం చూసుకోవడమే ఇక తరువాయని భావించి ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేశారు.

1963లో సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించి, తాపీ చాణక్య దర్శకత్వంలో ఎన్టీరామారావు, జమున, విజయలక్ష్మి హీరో, హీరోయిన్లుగా ‘రాముడు భీముడు’ అనే చిత్రాన్ని 1964 మే 21న చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది. పెండ్యాల నాగేశ్వరరావు అందించిన “తెలిసిందిలే నెలరాజా నీ రూపు తెలిసిందిలే..” ఉందిలే మంచి కాలం ముందు ముందునా..అందరూ సుఖపడాలి నందానందానా”… అనే పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమా మొదటి రోజు నుండే హిట్ టాక్ రావడం జరిగింది. అలా తాను మొదటి సినిమాలో పెట్టుబడి పెట్టిన డబ్బులతో పాటు లాభాలు కూడా ‘రాముడు భీముడు’ అనే చిత్రం తీసుకువచ్చింది. ఆ తర్వాత ప్రేమ్ నగర్, జీవనతరంగాలు, సోగ్గాడు, దేవత, అహ నా పెళ్ళంట మొదలగు చిత్రాలు నిర్మించారు.






























