Naga Chaitanya: కోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని ట్రాఫిక్ పోలీసులు ఎంతో స్ట్రిక్ట్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరైతే బ్లాక్ ఫిలిం ఉన్న కారులో ప్రయాణం చేస్తున్నారో వారి కార్లకు పెద్ద ఎత్తున జరిమానాలు విధిస్తూ కార్లకున్న బ్లాక్ ఫిలిం తొలగించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల కార్లను ఆపి పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు.
ట్రాఫిక్ రూల్స్ కి విరుద్ధంగా ఎవరు నడుచుకున్నా ఏ మాత్రం ఉపేక్షించకుండా వారికి పెద్ద ఎత్తున జరిమానాలు విధిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ హీరోలైన ఎన్టీఆర్, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, మనోజ్, డైరెక్టర్ త్రివిక్రమ్ వంటివారికి పోలీసులు చలాన విధించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ కోవలోకి నాగచైతన్య కూడా చేరిపోయారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద బ్లాక్ ఫిలిం ఉన్న కారులో ప్రయాణిస్తున్న నాగచైతన్య కారును ఆపిన పోలీసులు కారు మొత్తం సోదాలు నిర్వహించడమే కాకుండా కారుకి ఉన్న బ్లాక్ ఫిలిం తొలగిస్తూ అతనికి ఏడు వందల రూపాయలు జరిమానా విధించారు. అయితే పోలీసులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో కారులో నాగచైతన్య ఉండటం గమనార్హం.
ప్రస్తుతం నాగచైతన్యకు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుత కాలంలో జరుగుతున్న దాడులు, కిడ్నాప్ వంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని, వాటిని అదుపు చేయటం కోసం కోర్టు కార్లకు బ్లాక్ ఫిలిం తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలమేరకే బ్లాక్ ఫిలిం ఉన్న కార్లకు పెద్ద ఎత్తున ఫైన్ వేయడమే కాకుండా, బ్లాక్ ఫిలిం తొలగిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…