మాజీ మంత్రి దేవినేని ఉమకు బెయిల్‌ మంజూరు

టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమకు హైకొర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కొండపల్లి అటవీ ప్రాంతంలో గ్రావెల్‌ అక్రమ మైనింగ్‌ జరుగుతుందని విచారణ వెళ్ళిన మాజీ మంత్రి దేవినేని ఉమాపై వైకాపా నాయకులు రాళ్ల దాడి చేశారు. దీంతో తేదేపా, వైకాపా వర్గీయులు బాహాబాహీకి దిగారు. దీంతో తనపై దాడికి యత్నించిన వారిని అరెస్ట్ చేయాలంటూ వాహనంలోనే ఉమా నిరసనకు దిగారు. దీంతో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు పెదపారుపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఈ క్రమంలో ఉమ వర్గీయులు పలువురుపై దాడి చేశారనే నేఫథ్యంలో అతని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. దీంతో దేవినేని ఉమ హైకోర్టును ఆశ్రయించగా విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది.