Balagam fame Kota Jayaram : నీ మొఖానికి సినిమాలు అవసరమా అన్నారు… బుద్ధి, జ్ఞానం ఉండక్కర్లేదా…: బలగం ఫేమ్ కోట జయరాం

Balagam fame Kota Jayaram : తెలంగాణ పల్లె వాతావరణం, సంస్కృతిని సహజంగా చూపించి సక్సెస్ అయ్యాడు దర్శకుడు వేణు. ఒక మనిషి చనిపోయినపుడు ఇంట్లోని కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుంది ఎలా ఫీల్ అవుతారు లాంటి విషయాలను చాలా సునిశితంగా చూపించారు. బలగం సినిమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని కాకుండా దేశ విదేశాలలో చాలా మందికి నచ్చుతోంది. ఇక తెలంగాణ పల్లెల్లో అయితే గ్రామంలో అందరూ కలిసి సినిమా చూస్తూ ఎమోషనల్ అవుతున్నారు. అంతలా సినిమా అందరికీ కనెక్ట్ అయి ఆర్టిస్టులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎన్నో ఏళ్లుగా సినిమా. ఇండస్ట్రీలో ఉన్నా కూడా అంతగా రాని గుర్తింపు ఈ ఒక్క సినిమతో చాలా మంది ఆర్టిస్టులకు వచ్చింది. అలా సినిమాలో హీరోకి తండ్రి ఇలయ్యగా నటించిన కోట జయరాం గారు బాగా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఆయన పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆయన కెరీర్ గురించి మాట్లాడారు.

నీ మొఖానికి సినిమాలు అవసరమా…

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా ఉంటూ కస్టపడిన జయరాం గారికి బలగం సినిమా ఒక మంచి గుర్తింపునిచ్చింది. అంతకుముందు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసిన ఆయన ఎక్కువగా ఈటీవీ సీరియల్స్ లో నటించారు. అయితే సినిమా ఇండస్ట్రీలో పడిన కష్టాలు, అవమానాల గురించి మాట్లాడుతూ ఒక్కోసారి అవకాశాలు రాక ఇతర పనులు చేయలేక ఇబ్బందులను పడ్డాను.

నాతో ఉండే స్నేహితులందరూ ఉద్యోగాలు చేస్తూ సొతం ఇల్లు కట్టుకుని సెటిల్ అయితే నేను మాత్రం సినిమాలంటూ తిరగడం వల్ల కొన్నిసార్లు డిప్రెషన్ లోకి వెళ్లిపోయేవాడిని. కొంతమందికి మన బాధ చెప్పినా నీకు సినిమాలు అవసరమా, నీ మొఖానికి అంత సీన్ లేదు అంటూ మాట్లాడేవాళ్ళు. బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతారు. అలా మాట్లాడితే ఇంకెంత బాధపడుతామని అనుకోరు అంటూ ఆయనకు ఎదురైన అనుభవాలను తెలిపారు.