Actress Shirya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఒకానొక సమయంలో అగ్ర హీరోలు అందరి సరసన నటించిన శ్రియ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఒకవైపు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె మరోవైపు తన వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా గడుపుతున్నారు.
శ్రియ ఇండస్ట్రీలో కొనసాగుతూనే రహస్యంగా ఆండ్రు అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.ఇలా తన వివాహం గురించి ఈమె అభిమానులతో పంచుకొని అందరికీ షాక్ ఇచ్చారు.అయితే పెళ్లి విషయాన్ని మాత్రమే కాకుండా ఈమె తన ప్రెగ్నెన్సీ విషయాన్ని కూడా రహస్యంగా ఉంచారు ఏకంగా కూతురిని ఎత్తుకొని తన కూతురు అంటూ ఒక్కసారిగా అందరికీ ఈమె పెద్ద షాకింగ్ విషయాన్ని రివీల్ చేశారు.
అయితే ఈమె ప్రెగ్నెన్సీ సమయంలో పూర్తిగా కరోనా ఉండటం వల్ల ఈమె ఎక్కడ కూడా తన ప్రేగ్నెన్సీ విషయాన్ని బయట పెట్టలేదు.ఇలా కూతురి ఫోటోని షేర్ చేయడంతో అభిమానులు ప్రెగ్నెంట్ అనే విషయాన్ని శ్రియ దాచాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించగా అందుకు ఆమె సమాధానం చెబుతూ ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలలో ఎన్నో మార్పులు వస్తాయి.ఇది అందరిలో జరిగే సాధారణమైన మార్పులు అయినప్పటికీ సెలబ్రిటీల విషయంలో మాత్రం కాస్త భిన్నంగా చూస్తారు.
ప్రెగ్నెన్సీ సమయంలో శరీర బరువు పెరిగితే తనని చాలామంది బాడీ షేమింగ్ ట్రోల్స్ చేస్తారన్న కారణంతో తాను తన ప్రెగ్నెన్సీ ని బయటపెట్టలేదని తెలిపారు. ప్రెగ్నెన్సీ సమయంలో ఇలాంటి మానసిక సంఘర్షణకు గురికాకుండా ప్రశాంతంగా గడపడం కోసమే తన ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచి పెట్టానని చెప్పిన శ్రీయ తాజాగా తన బేబీ బంప్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇలా అప్పుడు రహస్యంగా ఉంచిన ఈ ఫోటోని ప్రస్తుతం ఈమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…