Balagam Movie: మొదటి రోజే కాపీ వివాదాలను ఎదుర్కొంటున్న బలగం… అసలు ఈ బలగం కథ ఎవరిదీ!

Balagam Movie: సాధారణంగా కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాలుగా విడుదలై మంచి విజయాలను అందుకుంటాయి. అలాగే కొన్ని సినిమాలు విడుదలైన తర్వాత పెద్ద ఎత్తున కాపీ వివాదాలను కూడా ఎదుర్కొంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చిన్న సినిమాగా విడుదలై ఎంతో మంచి విజయాన్ని అందుకున్నటువంటి బలగం సినిమా మొదటి రోజే కాపీ వివాదంలో చిక్కుకుంది.

జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా మారి ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా దిల్ రాజు నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం బలగం. తెలంగాణ యాసలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముందే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఇలా విడుదలైన అనంతరం ఈ సినిమా అంచనాలను చేరుకోవడమే కాకుండా కాపీ వివాదాలను కూడా ఎదుర్కొంటుంది.

బలగం సినిమా కథ నాదేనని నా కథను కాపీ కొట్టి ఈ సినిమా చేశారు అంటూ ప్రముఖ జర్నలిస్ట్ గడ్డం సతీష్ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గడ్డం సతీష్ మాట్లాడుతూ 2011వ సంవత్సరంలో తాను పచ్చికి అనే కథను రాసాను. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ యాసకు నిరాధారణకు గురికావడంతో.. ఈ కథ ప్రచూరణకు నోచుకోలేదు.

అప్పటి నుంచి నేను తెలంగాణ యాసలో కథలు రాయాలని నిర్ణయించుకున్నాను.2014వ సంవత్సరంలో నమస్తే తెలంగాణ పత్రికలో బతుకమ్మ మ్యాగ్జైన్లో అచ్చు వేసారని ఈయన తెలిపారు. ఇక ఈ కథ ఏంటి అనే విషయానికి వస్తే గత కొన్ని దశాబ్దాలుగా మనుషులు వ్యవహరిస్తున్నటువంటి సాంప్రదాయాల విషయానికి వస్తే ఒక మనిషి చనిపోతే ఆయన చనిపోయిన మూడవరోజు ఐదవ రోజు 11వ రోజు కర్మలు చేస్తుంటారు. ఇందులో భాగంగా పక్షులకు ఆహారం పెడతారు.

Balagam Movie: బలగం సినిమా క్రెడిట్ నాకే ఇవ్వాలి…

ఇలా పెట్టినటువంటి ఆహారాన్ని కాకులు వచ్చి కనుక తింటే చనిపోయిన వ్యక్తి ఆత్మ శాంతిస్తుందని విశ్వసిస్తారు. ఇప్పటికీ ఇదే ఆచారాన్ని ఫాలో అవుతూ చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి కర్మకాండలో ఇలా చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కథ రాశానని అయితే నేను రాసిన ఈ కథని 90% బలగం సినిమాలో పెట్టి 10% మాత్రమే మార్పులు చేశారు అంటూ గడ్డం సతీష్ ఆరోపించారు.ఈ విషయంపై దిల్ రాజు చొరవ చూపించి ఈ కథ క్రెడిట్ మొత్తం తనకు ఇప్పించాలని అలాకాని పక్షంలో తాను చట్టపరంగా ముందుకు వెళ్తానంటూ సతీష్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.