Movie News

Manchu Manoj Wedding: అంగరంగ వైభవంగా మనోజ్ మౌనిక రెడ్డి వివాహం… వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు!

Manchu Manoj Wedding: మంచు మనోజ్ మౌనికల వివాహం ఎంతో అంగరంగ వైభవంగా శుక్రవారం రాత్రి 8:30 నిమిషాలకు ఎంతో ఘనంగా జరిగింది. వీరి వివాహం ఫిలింనగర్ లో మంచు లక్ష్మీ నిలయంలో ఎంతో వైభవంగా జరిగింది. మంచు మనోజ్ నిర్ణయించిన ముహూర్తానికి మౌనిక రెడ్డి మెడలో మూడు ముళ్ళు వేశారు.

ఇలా వీరి వివాహం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల నడుమ ఎంతో ఘనంగా జరిగింది.ఇక వీరి వివాహ కార్యక్రమంలో భాగంగా భూమా కుటుంబ సభ్యులు మంచు కుటుంబ సభ్యులు పాల్గొని ఎంతో సంతోషంగా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో మంచు మోహన్ బాబు దంపతుల సైతం హాజరై సందడి చేశారు.

మంచు మోహన్ బాబుకు మనోజ్ భూమా మౌనికను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అందుకే పెళ్లికి దూరంగా ఉంటున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలన్నీ కేవలం అవాస్తవాలనీ తేలిపోయింది. మనోజ్ వివాహ వేడుకలలో మోహన్ బాబు దంపతులు హాజరై సందడి చేశారు.

Manchu Manoj Wedding: కుటుంబ సభ్యుల నడుమ మనోజ్ మౌనికల వివాహం…


ఇక భూమా మౌనిక రెడ్డి సోదరి అఖిలప్రియ దంపతులు అలాగే వీరి సోదరుడు కూడా హాజరయ్యారు.ఇక ఈ వివాహంలో మంచు లక్ష్మి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు మంచు లక్ష్మి మనోజ్ పెళ్లి వేడుకలను దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇలా కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో మనోజ్ మౌనిక ఇద్దరు సాంప్రదాయంగా పట్టు వస్త్రాలను ధరించి ఎంతో ముచ్చటగా కనిపిస్తున్నారు.ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టడంతో అభిమానులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago