Manoj Marriage: మంచు వారసుడిగా మనోజ్ అందరికీ ఎంతో సుపరిచితమే. అయితే తాజాగా ఈయన భూమా మౌనికతో కలిసి రెండోసారి పెళ్లి పీటలు ఎక్కి ఎంతో ఘనంగా వీరి వివాహాన్ని జరుపుకున్నారు. శుక్రవారం రాత్రి 8:30కు మనోజ్ మౌనికల వివాహం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.
ఇదివరకే మనోజ్ ప్రణతి అనే అమ్మాయిని వివాహం చేసుకొని కొన్ని కారణాల వల్ల తనకు విడాకులు ఇచ్చారు. మౌనిక సైతం ఇంతకుముందే ఒక అబ్బాయిని వివాహం చేసుకొని ఒక కుమారుడు జన్మించిన తర్వాత తనతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉన్నారు. ఇలా వీరిద్దరూ తిరిగి జీవితంలో ఒక్కటి అయ్యారు.ఇక మనోజ్ మొదటి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా సినీ పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది కానీ రెండో వివాహం మాత్రం చాలా సింపుల్ గా జరిగింది.
మంచు కుటుంబం అనుకుంటే ఈయన పెళ్లి ఎంతో వైభవంగా చేసేవారు కానీ ఇతని పెళ్లి ఫిలింనగర్ లో ఉన్నటువంటి మంచు లక్ష్మి నివాసంలో జరిగింది.ఇలా జరగడానికి కారణం ఏంటనే విషయానికి వస్తే నిజానికి మనోజ్ మౌనికను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనటువంటి మంచి ఫ్యామిలీ ఇతని పెళ్లి విషయంలో పెద్దగా ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది.అందుకే మంచు లక్ష్మి మనోజ్ పెళ్లి వేడుకలను తన భుజాలపై వేసుకొని తన ఇంట్లో నిర్వహించినట్లు సమాచారం.
గతంలో మనోజ్ అంటే తనకు ఎంత ఇష్టమో లక్ష్మీ ప్రసన్న పలుసార్లు తెలియజేశారు. మా ఇద్దరు తల్లులు వేరైనా మా రక్తం మాత్రం ఒకటే నేను తనని తమ్ముడిగా కాకుండా కొడుకుగా చూసుకుంటాను అంటూ ఎన్నోసార్లు మనోజ్ పై ఉన్నటువంటి ప్రేమను బయటపెట్టారు. అందుకే మౌనికను ప్రేమిస్తున్నట్లు మనోజ్ ముందుగా తన సోదరీ లక్ష్మికి తెలియచేయడంతో తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోయినా లక్ష్మీ ఒక అడుగు ముందుకు వేసి మనోజ్ పెళ్లి బాధ్యతలను తీసుకున్నారు. ఇక వీరి వివాహంలో ఇరుకు కుటుంబ సభ్యులు పాల్గొని సందడి చేశారు. మంచు మోహన్ బాబు సైతం వీరి వివాహానికి హాజరయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…