Geetha Krishna : బాలకృష్ణ సినిమాని కాపీ కొట్టి కొరటాల శ్రీమంతుడు సినిమా చేశారు.. డైరెక్టర్ గీతాకృష్ణ షాకింగ్ కామెంట్స్!

Geetha Krishna : కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం శ్రీమంతుడు. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాతో కొరటాల శివ పేరు ఇండస్ట్రీలో మారు మోగిపోయింది. ఒక ఊరిని దత్తత తీసుకొని ఆ ఊరిలో సేవా కార్యక్రమాలు చేయడం వంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాతో కొరటాల శ్రీమంతుడు సినిమాను తెరకెక్కించారు.

Srimanthudu: బాలకృష్ణ సినిమాని కాపీ కొట్టి కొరటాల శ్రీమంతుడు సినిమా చేశారు.. గీతాకృష్ణ షాకింగ్ కామెంట్స్!

తాజాగా ఈ సినిమా గురించి డైరెక్టర్ గీతాకృష్ణ షాకింగ్ కామెంట్ చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన గీతాకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను కాలేజీ చదువుకునే రోజుల్లోనే బాలచందర్ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు.

Srimanthudu: బాలకృష్ణ సినిమాని కాపీ కొట్టి కొరటాల శ్రీమంతుడు సినిమా చేశారు.. గీతాకృష్ణ షాకింగ్ కామెంట్స్!

ఈ విధంగా తన కెరియర్ మొదట్లో బాలచందర్, విశ్వనాథ్ వంటి లెజెండరీ డైరెక్టర్ దగ్గర తాను అసిస్టెంట్డైరెక్టర్ గా పని చేశానని తెలిపారు. ఈ క్రమంలోనే కె విశ్వనాథ్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో బాలకృష్ణ నటించిన జననీ జన్మభూమి సినిమాని తెరకెక్కించారని తెలిపారు. అప్పుడప్పుడే బాలక్రిష్ణ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకున్నారు.

పెద్ద లైబ్రరీగా మారిపోయాయి..

ఆ సమయంలో ఎన్టీఆర్ గారు సీఎం అయ్యారు. ఇక జననీ జన్మభూమి సినిమాని కొరటాల శివ మహేష్ బాబుతో శ్రీమంతుడు సినిమాగా తెరకెక్కించారని ఈ సందర్భంగా గీతాకృష్ణ వెల్లడించారు. జననీ జన్మభూమి సినిమాల్లో కూడా ఇలాంటి కాన్సెప్టే ఉందని సొంత ఊరికి వెళ్లి సేవా కార్యక్రమాలు చేస్తూ ఊరిని బాగు చేయడం అప్పట్లోనే ఇలాంటి కథ వచ్చిందని గీతా కృష్ణ వెల్లడించారు. అప్పట్లో వచ్చిన ఈ సినిమాలన్ని ప్రస్తుత డైరెక్టర్లకు ఒక లైబ్రరీలాగా పనిచేస్తాయని, అలా వచ్చిన సినిమానే శ్రీమంతుడు అంటూ ఈ సందర్భంగా గీత కృష్ణ మహేష్ బాబు కొరటాల శివ సినిమా గురించి షాకింగ్ కామెంట్ చేశారు.