Bindhu Madhavi : బిగ్ బాస్ నాన్ స్టాప్ ద్వారా మళ్ళీ గుర్తింపు తెచ్చుకుంది బిందు మాధవి. కండబలంతోనే కాదు వ్యక్తిత్వంతోను విన్నర్ అవ్వొచ్చని బిందు నిరూపించింది. మొదటిసారిగా బిగ్ బాస్ తెలుగులో అమ్మాయి విన్నర్ అయింది. దీంతో ఇక బిందు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆడపులి అంటూ బిందు మాధవిని తెగ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. బిగ్ బాస్ కి ముందు తెలుగులో బిందుకి మంచి ఆఫర్స్ లేవు. చెప్పుకోదగ్గ విజయాలు లేవు దీంతో తమిళం వైపు వెళ్ళింది. అక్కడ కెరీర్ మరి అంత సాఫీగా ఏమి లేదు. అయితే తమిళ బిగ్ బాస్ లో పాల్గొన్నా అంతగా తన కెరీర్ కి ఏమి ప్లస్ అవ్వలేదు.
బాలయ్యతో బంపర్ ఆఫర్……
ఇక తెలుగు బిగ్ బాస్ కి వచ్చిన బిందు టైటిల్ విన్నర్ అవడంతో ఇక తెలుగులో బాగా ఆఫర్స్ వస్తాయని అందరూ భావిస్తున్నారు. అలానే ఇపుడు బిందు కి ఒక బాలకృష్ణ సినిమాలో ఆఫర్ వచ్చినట్టు వార్త చక్కర్లు కొడుతోంది. అనిల్ రావిపూడి f3 సినిమా తరువాత తన తదుపరి ప్రాజెక్ట్ ను బాలకృష్ణ హీరోగా చేస్తున్నాడు. సెప్టెంబర్ నుండి షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నారట. అయితే బాలకృష్ణ సినిమాలో కీలక పాత్ర కోసం బిందుని తీసుకోవాలని అనుకుంటున్నారట.
ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియమణి, ఇక కూతురిగా శ్రీ లీలా నటిస్తోంది. ఇంతవరకు బాలకృష్ణ చేయనటువంటి విభిన్న కథాంశంతో ఈ సినిమా రానుందని అయితే సినిమాలో బాలకృష్ణ అభిమానులకు నచ్చే అంశాలు ఉంటాయని డైరెక్టర్ అనిల్ రావిపూడి భరోసా ఇస్తున్నారు. ఇక ఈ సినిమా ఛాన్స్ నిజంగా బిందుకి వస్తే తెలుగులో బిందు క్రేజ్ మరింత పెరగడం ఖాయం. అదికాక కెరీర్ కూడా ఊపందుకుంటుందనడంలో సందేహం లేదు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…