Bandla Ganesh: షాకింగ్ నిర్ణయం తీసుకున్న బండ్ల గణేష్..! ఇక సినిమాలు చేయనంటూ వ్యాఖ్యలు..!

Bandla Ganesh: బండ్ల గణేష్ ఈ పేరు తెలియని వారుండరు తెలుగు రాష్ట్రాల్లో. చిన్న యాక్టర్ గా తన కెరీర్ ను మొదలు పెట్టిన బండ్ల గణేస్.. ప్రస్తుతం పొడ్యూసర్ గా, పొలిటీషియన్ గా, వ్యాపార వేత్తగా దూసుకుపోతున్నారు. తాజాగా ‘డేగల బాజ్జి’ సినిమాతో మొదటిసారిగా హీరోగా మారబోతున్నారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాకు వెంటక్ చంద్ర దర్శకత్వం వహించారు. 

Bandla Ganesh: షాకింగ్ నిర్ణయం తీసుకున్న బండ్ల గణేష్..! ఇక సినిమాలు చేయనంటూ వ్యాఖ్యలు..!

త్వరలో డేగల బాజ్జి వెండితెరపైకి రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బండ్ల గణేష్ కుతురు ద్రిష్టి చేతుల మీదుగా లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. సినిమాను ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చూశారు. తమిళంలో జాతీయ అవార్డ్ వచ్చిన సినిమాను నాతో తెలుగులో తీస్తున్నారని.. మొదట సినిమా చేయడానికి ఒప్పుకోకున్నా… తన స్నేమితుడు వెంకట్ చంద్ర వదలకుండా నాతో సినిమా చేశాడని వెల్లడించాడు.

Bandla Ganesh: షాకింగ్ నిర్ణయం తీసుకున్న బండ్ల గణేష్..! ఇక సినిమాలు చేయనంటూ వ్యాఖ్యలు..!

ఒక రూమ్ లో ఒక సినిమాను రెండు గంటల పాటు ఒకే క్యారెక్టర్ చేయడం రిస్క్ అని అయన అన్నారు. సినిమా పూర్తయిన తర్వాత నాక్యారెక్టర్ చూస్తే నాకే అద్భుతంగా అనిపించిందని.. నేనే చేశానా ఈ యాక్టింగ్అన్న రీతిలో సినిమా వచ్చిందని బండ్ల గణేష్ అన్నారు. నటుడిగా జీవితానికి ఇది చాలని అనుకున్నా అంటూ వ్యాఖ్యలు చేశారు. 


తన కెరీర్ గురించి సీరియస్ కామెంట్లు ..

పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ సినిమా తీసినప్పుడు ఎంత ఆనందంగా ఉందో .. ప్రస్తుతం అంతే ఆనందంగా ఉందని గణేష్ అన్నారు. ఈ రోజు విడుదలైన సాంగ్ చాలా బాగా వచ్చిందని.. లైనస్ చాాలా మంచి మ్యూజిక్ అందించారని అన్నారు. ప్రతి ఒక్కరూ కళ్లార్పకుండా ఈ సినిమా చూస్తారు. బండ్ల గణేష్ ఇంత బాగా యాక్ట్ చేస్తారా అని రెస్పెక్ట్ ఇస్తారు. ఈ రెస్పెక్ట్ కోసమే నేను 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా అని బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు.  ఇదిలా ఉంటే తన కెరీర్ గురించి సీరియస్ కామెంట్లు చేశారు బండ్ల గణేష్. తను ఇక భవిష్యత్తులో సినిమాల్లో యాక్టింగ్ చేస్తానో లేదో అని సంచలన కామెంట్స్ చేశారు. కానీ ఈ డేగల బాబ్జి ద్వారా నాజన్య ధన్యమైందని అనుకుంటున్నా అని అన్నారు. వెంకట్ చంద్ర తెలుగు ఇండస్ట్రీలో ఓ గొప్ప డైరెక్టర్ అవుతారని అన్నారు. ముందుగా ఈసాంగ్ ను స్టార్ హీరోతో విడుదల చేద్దాం అనుకున్నా అని.. అయితే కోవిడ్ సమయంలో ఇబ్బంది పెట్టడం ఎందుకు అని వద్దనుకున్నా అని.. వారందరి ఆశీర్వాదాలు నాకు ఎప్పుడు ఉంటాయని గణేష్ అన్నారు.